Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న అనిల్ రావిపూడి... క్లారిటి ఇచ్చిన దర్శకుడు...

Anil Ravipudi: రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న అనిల్ రావిపూడి… క్లారిటి ఇచ్చిన దర్శకుడు…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. హీరోలు ఎవరు అనేదానికంటే కూడా దర్శకులు ఎవరు అనే దాని మీదనే ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో ఏం చేసినా కూడా తన వెనకాల దర్శకుడు ఉండి చేయిస్తేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఇక దర్శకుడి ప్రతిభ అనేది చాలా వరకు ఎఫెక్టివ్ గా పోట్రే అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలంటే ఆ దర్శకుడు […]

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. హీరోలు ఎవరు అనేదానికంటే కూడా దర్శకులు ఎవరు అనే దాని మీదనే ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో ఏం చేసినా కూడా తన వెనకాల దర్శకుడు ఉండి చేయిస్తేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఇక దర్శకుడి ప్రతిభ అనేది చాలా వరకు ఎఫెక్టివ్ గా పోట్రే అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలంటే ఆ దర్శకుడు రాసుకున్న కథ బాగుండాలి. దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం అద్భుతంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన హీరో హైలైట్ అవుతాడని ప్రతి ప్రేక్షకుడు, అభిమాని కూడా భావిస్తున్నాడు. అందువల్లే కొన్ని కాంబినేషన్లను సెట్ చేయడానికి ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి దర్శకుడు నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల్లోఎంటర్టైన్మెంట్ ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేసే సినిమా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి రాజమౌళి సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం సంవత్సరానికి ఒక సినిమాను చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన తిరుగులేని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను పెట్టి మరో సినిమా చేస్తున్నాడు.

ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో చిరంజీవికి అదిరిపోయే సక్సెస్ ని అందించిన ఆయన వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఒక సినిమాకి 30 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడట.

అంటే నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈ లెక్కన ఆయన 120 కోట్ల రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు. ఇక రాజమౌళి ఒక సినిమా కోసం 100 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. దీంతో రాజమౌళి కంటే అనిల్ రావిపూడి ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటు కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.

రాజమౌళి నాలుగు సంవత్సరాలలో చేసేది అనిల్ రావిపూడి సంవత్సరానికో సినిమా చొప్పున చేస్తున్నాడు. వరుస సక్సెస్లను సాధిస్తూనే తను కూడా భారీ విజయాలను అందుకుంటూ ప్రొడ్యూసర్స్ ను సేఫ్ జోన్ లో ఉంచుతున్నాడు. తద్వారా అతనితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper