Box Office Collections: భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాలు కొన్ని ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే అభిమానులు చాలా హట్ అవుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోల సినిమాలు కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా మరింత ఎక్కువ డల్ అవుతుంటారు అభిమానులు. అయితే ప్రస్తుతం థియేటర్ లలో నడుస్తున్న కొన్ని సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయో ఓ సారి లుక్ వేసేయండి…
1..ఈగల్: రవితేజ నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓపెనింగ్స్య లో మంచి కలెక్షన్లు రాబట్టినా తర్వాత డన్ ఫాల్ నడుస్తున్నట్టు ఉంది. ఆదివారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఇక మొదటి వారంలో ఈ సినిమా రూ. 18.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
2..యాత్ర 2..యాత్ర సినిమాకు కొనసాగింపుగా వచ్చిన సినిమా యాత్ర 2. మొదట్లో రాజకీయపరంగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది కానీ అనుకున్న పలితాలను సాధించలేకపోయింది. మొదటి వారం ఈ సినిమా కేవలం రూ. 5 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక ఈ వారం సినిమా కలెక్షన్లు ప్రశ్నార్థకంగా మిగిలే అవకాశం ఉంది.
3.. లాల్ సలామ్.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రజనీకాంత్ కీలకపాత్రలో వచ్చిన లాల్ సలామ్ సినిమా తెలుగులో డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది. తమిళ వర్షన్ లో ఓపెనింగ్స్ లో కాస్త వసూళ్లు వచ్చినా ఇతర భాషల్లో మాత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చివరి వారంలో రూ. 11.45 కోట్ల వసూళ్లను సాధించింది. కానీ తెలుగులో అయితే కేవలం కోటి రూపాయలను మాత్రమే సాధించిందట.
4..హనుమాన్.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ఉన్నప్పటికీ ఈ వారం కాస్త కలెక్షన్లు డల్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా విడుదలై ఇప్పటికే నెల రోజులు గడుస్తోంది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడం విశేషం. అయితే 31వ రోజు కూడా దేశవ్యాప్తంగా రూ. 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగలిగింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
5.. ట్రూ లవర్.. ఈ సినిమా వస్తుందని కూడా ఎవరికి తెలియదు. ఇక సినిమా ఓపెనింగ్స్ అంతంత మాత్రమే అని చెప్పాలి. ఇక ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా డీలా పడిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమాల వీకెండ్ కలెక్షన్లు చూశారు కదా.. అందులో కొన్ని మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంటే.. మరికొన్ని మాత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక హనుమాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో సినిమాతోనే ఈ సినిమా పోటీ పడి గెలిచిన విషయం తెలిసిందే.