Homeఎంటర్టైన్మెంట్Vijay Jana Nayakudu: విజయ్ జన నాయకుడు ప్లాప్ టాక్ తో భగవంత్ కేసరి కంటే...

Vijay Jana Nayakudu: విజయ్ జన నాయకుడు ప్లాప్ టాక్ తో భగవంత్ కేసరి కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసిందిగా..

Vijay Jana Nayakudu: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేయగలిగే నటుడు విజయ్…ప్రస్తుతం తమిళనాడు సీఎంగా మారిన విజయ్ సినిమాలకు స్వస్థి చెప్పాడు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందుగానే ఆయన ‘జననాయకుడు’ అనే ఒక సినిమా చేశాడు. ఈ సినిమాని ఎలక్షన్ టైం లో రిలీజ్ చేసుకోవడానికి అనుమతి లేకుండా సెన్సార్ నుంచి సర్టిఫికెట్ రాకుండా చేశారు. దాంతో ఆ సినిమా అప్పుడు రిలీజ్ అవ్వలేదు. మొత్తానికైతే విజయ్ సీఎం […]

Vijay Jana Nayakudu: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేయగలిగే నటుడు విజయ్…ప్రస్తుతం తమిళనాడు సీఎంగా మారిన విజయ్ సినిమాలకు స్వస్థి చెప్పాడు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందుగానే ఆయన ‘జననాయకుడు’ అనే ఒక సినిమా చేశాడు. ఈ సినిమాని ఎలక్షన్ టైం లో రిలీజ్ చేసుకోవడానికి అనుమతి లేకుండా సెన్సార్ నుంచి సర్టిఫికెట్ రాకుండా చేశారు. దాంతో ఆ సినిమా అప్పుడు రిలీజ్ అవ్వలేదు. మొత్తానికైతే విజయ్ సీఎం అయిన తర్వాత రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. తెలుగులో బాలయ్య బాబు హీరోగా చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమాలోని కోర్ పాయింట్ ను తీసుకొని దాని చుట్టు పొలిటికల్ స్టోరీ మొత్తాన్ని అల్లేసారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకుడికి అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. సినిమా మొదటి రోజు నుంచే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

అయినప్పటికి ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు హీరోగా చేసిన భగవత్ కేసరి సినిమా కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది… ఇప్పటివరకు జననాయకుడు సినిమాకి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి… బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాకి కేవలం 200 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.

భగవంత్ కేసరితో పోలిస్తే ఈ సినిమా డబుల్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ప్లాప్ టాక్ తో కూడా ఆ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టిందంటే విజయ్ క్రేజ్ తమిళ ఇండస్ట్రీ లో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన సీఎం గా ప్రజలకు సేవ చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలకు స్వస్తి చెప్పడం అక్కడున్న అతని అభిమానులకు కొంతవరకు నచ్చనప్పటికీ తను సీఎంగా మారాడు. కాబట్టి ఆయన చాలా ఎక్కువ బాధ్యతలను మోయాల్సి ఉంది. తద్వారా తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి పనులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper