Photo Story: ఈ ఫొటోలో ఒక స్టార్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఉన్నారు. హీరోయిన్ అయితే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి. బాలకృష్ణతో వంటి స్టార్ హీరో పక్కన నటించింది. ఎక్కువగా టైర్ టూ హీరోల చిత్రాల్లో నటించింది. ఓ పదేళ్లు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ సంగీత.
1997లో వెండితెరకు పరిచయమైన సంగీత ఆశల సందడి అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమెకు బ్రేక్ మూవీ మాత్రం ఖడ్గం. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సూపర్ హిట్ కొట్టింది. హీరోయిన్ కావాలని పల్లెటూరు నుండి వచ్చిన అమాయకపు అమ్మాయి పాత్రలో అలరించింది. ఒక్క ఛాన్స్ అంటూ సంగీత చెప్పే డైలాగ్ హైలెట్. ఖడ్గం అనంతరం తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి.
విజయేంద్ర వర్మ చిత్రంలో బాలయ్యకు జంటగా నటించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో స్టార్స్ పక్కన ఆమెకు ఛాన్సులు రాలేదు, శ్రీకాంత్, జగపతిబాబు, శివాజీ, రవితేజ సరసన నటించింది. 2009లో ఫార్మ్ లో ఉండగానే సంగీత పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గించింది. 2011 తర్వాత ఆమె ఆచితూచి సినిమాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.
సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ రష్మిక మందాన తల్లి పాత్ర చేసింది. అలాగే మసూద మూవీలో టీనేజ్ అమ్మాయికి తల్లి పాత్ర చేసింది. కాగా సంగీత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. కారణం ఆ ఫోటోలో ఆమె గుర్తు పట్టలేనంతగా ఉంది. యంగ్ ఏజ్ లుక్ కి, ఇప్పటి లుక్ కి చాలా తేడా ఉంది. మరో విశేషం ఏమిటంటే ఆ ఫోటోలో ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నాడు.
ఆయనెవరో కాదు వెంకట్ ప్రభు. నా ఫస్ట్ హీరో అంటూ వెంకట్ ప్రభుకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ సంగీత ఆ ఫోటో షేర్ చేసింది. వెంకట్ ప్రభు కోలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరు. ఇటీవల కస్టడీ టైటిల్ తో నాగ చైతన్యతో ఓ మూవీ చేశారు. నెక్స్ట్ విజయ్ హీరోగా మూవీ చేస్తున్నారు. సంగీత-వెంకట్ ప్రభు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది…