India Vs Australia Final 2023: వరల్డ్ కప్ 2023 లో భాగంగా నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇక ఈ మ్యాచ్ లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి.ఇక రీసెంట్ గా జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ఫైనల్ కీ చేరుకుంది. ఇక ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టీం లా మధ్య జరిగే ఈ భారీ పోరులో ఎవరు గెలుస్తారు అనేది చాలా కీలకం గా మారింది. ఇక ఈ రెండు టీమ్ లు 2003 వ సంవత్సరం వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడగా ఆ మ్యాచ్ లో ఇండియన్ టీం ఓడిపోయింది. ఇంకా ఇండియా మీద ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించి వరల్డ్ కప్పును కూడా అందుకుంది. ఇక ఇప్పటికే ఐదుసార్లు వరల్డ్ కప్ అందుకున్న ఆస్ట్రేలియా టీమ్ మరోసారి కప్పు దక్కించుకోవాలని చూస్తుంది. ఇక ఈ క్రమంలో ఇండియన్ ప్లేయర్లు ఆస్ట్రేలియాని ఎంతవరకు కట్టడి చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది….
ఈ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు ఆడుతున్న క్రమంలో ఇండియన్ టీం అద్భుతమైన పర్ఫామెన్స్ తో వరుసగా తొమ్మిది మ్యాచ్ ల్లో గెలిచింది. లీగ్ దశలో ఇండియా ప్రతి మ్యాచ్ లో తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా జరిగిన సెమీఫైనల్ మ్యాచులో ఇండియన్ టీమ్ తన పూర్తి శక్తి యుక్తులతో పోరాటం చేయలేదని అనిపిస్తుంది.
బ్యాటింగ్ లో పర్వాలేదు అనిపించినప్పటికీ బౌలింగ్ లో మాత్రం బౌలర్లు తేలిపోయారు. ఇక దీనికి ప్రధాన కారణం ఇండియన్ టీం లో ఎక్స్ ట్రా బౌలర్ లేకపోవడమే…ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ లో కేవలం ఐదుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. వాళ్లకు తోడుగా ఇంకో నార్మల్ బౌలర్ ఉన్న బాగుండేది. ఐదుగురు మాత్రమే ఉండడం వల్ల వీళ్ళందరూ 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ వేస్తేనే 50 ఓవర్లు పూర్తి చేయాల్సి వస్తుంది. నెదర్లాండ్స్ మీద జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ లాంటి ప్లేయర్లు బౌలింగ్ చేసినప్పటికీ పెద్ద మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసేంత కెపాసిటీ అయితే వాళ్లకు లేదు. కాబట్టి హార్దిక్ పాండ్యా కి గాయం అవ్వడం ఇండియన్ టీమ్ కు కోలుకోలేని దెబ్బగా మారింది అనే చెప్పాలి.
సెమీఫైనల్ మ్యాచ్ లో ఆరోవ బౌలర్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఇప్పుడు అడబొయే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ నిండా మంచి బ్యాట్స్ మెన్స్ ఉండడంతో వారిని కట్టడి చేయాలంటే ఆరో నెంబరు బౌలర్ ఇండియన్ టీం లో ఉండాలి. లేకపోతే మాత్రం ఇండియన్ టీమ్ చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది… ఇక మరి ఆ ఆరో బౌలర్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇక మనకి కనిపిస్తున్న ఒకే ఒక్క బౌలర్ అయితే అశ్విన్…
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో
సూర్య కుమార్ యాదవ్ ని పక్కనపెట్టి అశ్విన్ తీసుకుంటారేమో చూడాలి. ఇప్పుడు ఇండియన్ టీమ్ బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ లో స్ట్రాంగ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది.కాబట్టి ఇండియన్ టీమ్ లో ఉన్న బౌలర్ల ని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఈ విషయం మీద రోహిత్ శర్మ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇక్కడ కీలకంగా మారనుంది…