Homeఎంటర్టైన్మెంట్Pan India Star Heroine: పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాన్...

Pan India Star Heroine: పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్..ఎవరో కనిపెట్టగలరా!

Pan India Star Heroine: ఈ ఫొటోలో పోలీస్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు , ఈమె ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సినీ రంగం పై మక్కువతో మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సినిమాల్లోకి ఆడిషన్స్ ద్వారా అడుగుపెట్టింది. మొదటి సినిమా తోనే పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన గుర్తింపు […]

Pan India Star Heroine: ఈ ఫొటోలో పోలీస్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు , ఈమె ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సినీ రంగం పై మక్కువతో మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సినిమాల్లోకి ఆడిషన్స్ ద్వారా అడుగుపెట్టింది. మొదటి సినిమా తోనే పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన గుర్తింపు , క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ మూవీస్ లో నటిస్తూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తోంది. తెలుగు ఆడియన్స్ లో కూడా ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉంది. ఆమె మరెవరో కాదు శ్రీనిధి శెట్టి.

ఈమె 2018 వ సంవత్సరం లో ‘KGF : చాప్టర్ 1’ తో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన సెన్సేషన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ తర్వాత ‘KGF : చాప్టర్ 2’ కూడా పాన్ ఇండియా లెవెల్ లో 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత తమిళం లో విక్రమ్ హీరో గా నటించిన ‘కోబ్రా’ లో హీరోయిన్ గా నటించింది కానీ , ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమె న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘హిట్ : ది థర్డ్ కేస్ ‘ లో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత చేసిన ‘తెలుసు కదా’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వకపోయిన, శ్రీనిధి శెట్టి కి మాత్రం మంచి పేరు ని తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ప్రస్తుతం ఆమె విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ – 47’ లో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే శ్రీనిధి శెట్టి రేంజ్ టాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన క్యారెక్టర్స్ టీజర్స్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది , సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper