Homeఎంటర్టైన్మెంట్Tamil Directors Losing Craze: తమిళ ఇండస్ట్రీ వెనకబడిపోయిందా.. వాళ్ల డైరెక్టర్ల హవా తగ్గిపోయిందా...

Tamil Directors Losing Craze: తమిళ ఇండస్ట్రీ వెనకబడిపోయిందా.. వాళ్ల డైరెక్టర్ల హవా తగ్గిపోయిందా…

Tamil Directors Losing Craze: గత కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు దర్శకుల హవానే కొనసాగుతుంది. బాలీవుడ్ హీరోలు సైతం మన దర్శకుల కోసం ఎదురుచూస్తుండటం విశేషం…తెలుగులో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ 2000 కోట్ల మార్క్ కి దగ్గరలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ దర్శకులు కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు పూర్తి ఫామ్ ను కోల్పోయారనే […]

Tamil Directors Losing Craze: గత కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు దర్శకుల హవానే కొనసాగుతుంది. బాలీవుడ్ హీరోలు సైతం మన దర్శకుల కోసం ఎదురుచూస్తుండటం విశేషం…తెలుగులో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ 2000 కోట్ల మార్క్ కి దగ్గరలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ దర్శకులు కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు పూర్తి ఫామ్ ను కోల్పోయారనే చెప్పాలి. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా సక్సెస్ ను సాధించడం లేదు. ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ అంటే వరుసగా సక్సెస్ లే గుర్తుకువచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం అక్కడున్న దర్శకులు ఒక్క సక్సెస్ వస్తే చాలు అంటూ ఎదురుచూసే రోజులు వచ్చాయి. పాన్ ఇండియాలో వాళ్ళు ఏ రేంజ్ కి పడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు భారీ సినిమాలను చేస్తున్నారు. ముఖ్యంగా అట్లీ, లోకేష్ కనకరాజు లాంటి దర్శకులు మాత్రం పాన్ ఇండియా హిట్ కొట్టాలనే ప్రయత్నం చేసిన కూడా వర్కౌట్ కావడం లేదు. కార్తీక్ సుబ్బరాజు సైతం గతంలో చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించిన కూడా ఈ మధ్య కాలం లో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పించడం లేదు. దాంతో ఆయన పని అయిపోయింది అంటు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికైతే తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సక్సెస్ లను సాధించిన దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా ప్రస్తుతం ఒక సక్సెస్ వస్తే చాలు అనే రేంజ్ కి వాళ్ళు పడిపోయారు. ఇక తమిళ్ నుంచి 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోలు కూడా ఎవరు లేరు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ హీరోల పతనం కూడా ప్రారంభమైందనే చెప్పాలి. ఎందుకోసమని వీళ్ళు చేసిన సినిమాలు పాన్ ఇండియాలో ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం సౌత్ లో తమిళ ఇండస్ట్రీ ఒక్కటే వెనకబడి పోయింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కాంతార చాప్టర్ వన్’ 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.

అలాగే మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక బాలీవుడ్ లో వచ్చిన ‘దురంధర్’ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించింది. కేవలం తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు మాత్రమే ప్రేక్షకుడిని అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోవడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper