Kantara Chapter 1: 2022 వ సంవత్సరంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా రిలీజై పాన్ ఇండియాను శాసించిన సినిమా ‘కాంతార’… పెంజర్లీ, గులిగ దేవతల యొక్క విశిష్టతను తెలియజేస్తూ రూపొందిన ఈ సినిమా ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. 5 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది…ఇక అలాంటి సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా అక్టోబర్ రెండోవ తేదీన రిలీజై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాని చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మొత్తానికైతే ఈ సినిమా 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టింది…
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కొంతవరకు నష్టాలను మిగిల్చిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాని 100 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా తెలుగులో ఇప్పటివరకు 75 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. అంటే 25 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే కాంతార చాప్టర్ 1 సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్లను నష్టానికి గురి చేసింది. నిజానికి 2022 లో వచ్చిన కాంతార మూవీ కి వచ్చినంత క్రేజ్ ఈ కాంతార చాప్టర్ 1 సినిమాకి రాలేకపోయిందని అందువల్లే ఈ సినిమాని చూసే జనాల సంఖ్య తగ్గిపోయింది. దానివల్ల సినిమాకి కొంతవరకు నష్టాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
మొత్తానికైతే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి అత్యధిక వసూళ్లను సాధించిన రెండోవ సినిమాగా కాంతారా చాప్టర్ 1 నిలిచింది. మొదటి ప్లేస్ లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన ‘కేజిఎఫ్ 2’ సినిమా నిలిచింది. ఈ మూవీ లాంగ్ రన్ లో 1200 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది…దాని తర్వాత ప్లేస్ ని కాంతారా చాప్టర్ 1 దక్కించుకోవడం విశేషం…