spot_img
Homeఎంటర్టైన్మెంట్Sankranti Vasthunnam : ఆశ్చర్యపరుస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' అడ్వాన్స్ బుకింగ్స్..వెంకటేష్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని...

Sankranti Vasthunnam : ఆశ్చర్యపరుస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అడ్వాన్స్ బుకింగ్స్..వెంకటేష్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని గ్రాస్ వసూళ్లు ఇవి!

Sankranti Vasthunnam :  ఒకప్పుడు సీనియర్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ కి ఉన్నంత సక్సెస్ రేట్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికి కూడా లేదు అనేవారు ట్రేడ్ పండితులు. ప్రతీ సంవత్సరం ఆయన ఎదో ఒక సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసేవాడు. కానీ వెంకటేష్ ఈమధ్య కాలం లో సోలో హీరో గా హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. 2007 వ సంవత్సరం లో విడుదలైన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’, ‘తులసి’ చిత్రాలే ఆయన చివరి కమర్షియల్ సూపర్ హిట్స్. ఆ తర్వాత సోలో హీరో గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ‘దృశ్యం’, ‘గురు’ వంటి చిత్రాలు పర్వాలేదు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆడినప్పటికీ, వెంకటేష్ స్థాయికి తగ్గ సూపర్ హిట్స్ మాత్రం కాదు. మల్టీస్టార్రర్ చిత్రాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటివి బాగానే ఆడాయి.

ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి తో ముచ్చటగా మూడవసారి కలిసి చేసిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు నిర్మాతగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని మాటలకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ‘గోదారి గట్టు మీద’ సాంగ్ వినిపిస్తూనే ఉంది. కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాదు, ఆ తర్వాత విడుదలైన రెండు పాటలకు కూడా యూట్యూబ్ షేక్ అయ్యింది. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్ గానే బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా టికెట్స్ ప్రతీ ప్రాంతంలో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి.

బుక్ మై షో లో ఈ సినిమాకి ప్రస్తుతం గంటకు 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఏ రేంజ్ ట్రెండ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు అవ్వలేదు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది, ఇక నేడు విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య సినిమాని చూసేందుకు అంతగా అమితాసక్తి ని చూపించరు. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఒక్కసారిగా బజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఊపు చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 34 కోట్ల రూపాయలకు జరిగింది. టాక్ వస్తే కేవలం మూడు రోజుల్లో ఈ మార్కుని అందుకుంటుంది. బయ్యర్స్ కి లాభాలే,లాభాలు, చూడాలి మరి ఏమి జరగబోతుందో.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Oktelugu Epaper