spot_img
Homeఎంటర్టైన్మెంట్Suriya And Jyothika: విడాకులన్నారు.. విడిపోయారన్నారు.. ఇప్పుడు చూసి కుళ్ళు కుంటున్నారు

Suriya And Jyothika: విడాకులన్నారు.. విడిపోయారన్నారు.. ఇప్పుడు చూసి కుళ్ళు కుంటున్నారు

Suriya And Jyothika: ఏదో ఒక నిప్పురాజేయంది.. ఎక్కడో ఒకచోట మంట పెట్టంది.. మీడియా ఊరుకోదు. అందుకే సెలబ్రిటీలు మీడియాకు దూరంగా ఉంటారు. ఆచి తూచి మాట్లాడుతుంటారు. ఇక తమిళంలో సూర్య అయితే మీడియాను చాలా దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే గతంలో మీడియా వల్ల అతడు చాలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి.. అయితే ఇటీవల ఆ మీడియా అతడిపై అడ్డగోలుగా రాసింది. అతడు, జ్యోతిక విడిపోతున్నారని.. జ్యోతిక తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ముంబై వెళ్ళిపోయిందని.. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోందని.. సూర్య కూడా విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని.. రాసి పడేసింది. ఇలా రాస్తున్నప్పుడు కనీసం వివరణ తీసుకోవాలనే సోయి కూడా అక్కడి మీడియాకు లేనట్టుంది. పైగా సెలబ్రిటీల జీవితాల్లో టార్చ్ లైట్ వేసి వెతికి మరి చూడటం మీడియాకు అలవాటు కదా.. ఆ లెక్కకు వస్తే తమిళ మీడియాతో పోలిస్తే తెలుగు ఒకింత నయమే. ఈ వ్యవహారంపై అటు సూర్య, ఇటు జ్యోతిక సమయమనం పాటించారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అటు సూర్య తన కంగువా సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు. ఇటు జ్యోతిక సైతాన్ సినిమా చిత్రీకరణలో ఉండిపోయింది. దీంతో మీడియా కూడా సైలెంట్ అయిపోయింది.

జ్యోతిక నటించిన సైతాన్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తో జ్యోతిక స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ముంబైలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమానికి జ్యోతిక భర్త సూర్య హాజరయ్యాడు. జ్యోతిక సూర్యతో కలిసి సైతాన్ సినిమా ఫ్లెక్సీ ముందు ఫోటో దిగింది. ఇద్దరు కూడా నలుపు రంగు డ్రెస్ వేసుకుని మరి ఫోటో దిగడం విశేషం. అనంతరం ఇద్దరు పక్కపక్కనే కూర్చుని సినిమాకు సంబంధించి మాట్లాడుకున్నారు. మధ్యలో అజయ్ కూడా చేరడంతో ముగ్గురు చాలాసేపు సంభాషించుకున్నారు.. పచ్చగా ఉంటే మీడియా ఊరుకోదు అనుకుంటా.. ఇలా జ్యోతిక, సూర్య కలిసి ఉంటే కుళ్ళుకుంది.

చూశారా.. ఆమధ్య మీడియాతో వార్తలు రావడం వల్లే సూర్య, జ్యోతిక కలిసిపోయారు. అంతకుముందు ఆమెను సినిమాల్లో నటింపజేసేవాడు కాదు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఓకే చెప్పేస్తున్నాడు. సూర్య మారిపోయాడు. జ్యోతిక చెప్పినట్టు వింటున్నాడు. అందుకే ముంబై వచ్చాడు. ఆమె నటించిన సైతాన్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇలా రాసుకుంటూ పోయింది తమిళ మీడియా.. అయినా ఇక్కడ ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి అధికారం మీడియాకు ఎవడిచ్చాడు? వారిద్దరు భార్యాభర్తలు, పెళ్లికి ముందే వారు ప్రేమించుకున్నారు, అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు యుక్త వయసు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అలాంటప్పుడు వారికి ఏది మంచో, ఏది చెడో తెలియదా? ఒకవేళ విభేదాలు తలెత్తితే విడిపోతారు.. ఎన్ని జంటలు విడిపోవడం లేదు, ఎంతమంది కటీఫ్ చెప్పుకోవడం లేదు.. దానికి సూర్య, జ్యోతిక ఏమైనా అతీతమా? వారిద్దరు విడిపోతే బ్రహ్మాండం బద్దలై పోయే వార్తనా.. ఎక్కడి నుంచి వస్తార్రా భయ్.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper