Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్ శ్రీలీల . ‘పెళ్లి సందడి’ చిత్రం తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈమె, అంతకు ముందు కన్నడ లో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ , పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ తెలుగు లో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ‘పెళ్లి సందడి’ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ధమాకా’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో శ్రీలీలకి ఆఫర్స్ క్యూలు కట్టాయి. అతి తక్కువ సమయం లోనే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , నందమూరి బాలకృష్ణ వంటి సూపర్ స్టార్స్ తో కలిసి నటించే అవకాశం సంపాదించింది. కానీ ‘ధమాకా’ తర్వాత ‘భగవంత్ కేసరి’ తప్ప ఈమెకు మరో హిట్ లేకపోవడం గమనార్హం.
చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వస్తోంది. దీంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావడం దాదాపుగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమె తమిళ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా ఈమె మొదటి చిత్రం ‘పరాశక్తి’ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక శ్రీలీల పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయం లో , ధనుష్ ‘ఓం’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. సౌత్ ఇండియా లోనే మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం తో పాటు శ్రీలీల మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ కాంబినేషన్ లో త్వరలోనే ఒక మల్టీస్టార్రర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది.
ఈ సినిమాలో రజినీకాంత్ కూతురు గా శ్రీలీల కనిపించబోతుంది అట. సినిమాలో ఆమెది చాలా కీలకమైన పాత్ర అని టాక్. ఈ చిత్రానికి ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తక్కువలో తక్కువ ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. అలాంటి క్రేజీ మూవీ లో వరుస డిజాస్టర్స్ ట్రాక్ రికార్డు ఉన్న శ్రీలీల కి ఛాన్స్ దక్కడం అనేది మామూలు విషయం కాదు. దీన్ని బట్టీ ఆమె అదృష్టం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది. చూడాలి మరి ఈ చిత్రం తో ఆయన ఆమె అదృష్టం మారుతుందా లేదా అనేది.