HomeActorsPrabhas Birthday: ప్రభాస్ బర్త్డే నాడు.. మైత్రి మూవీస్ కు షాక్ ఇచ్చిన వైజయంతి మూవీస్..

Prabhas Birthday: ప్రభాస్ బర్త్డే నాడు.. మైత్రి మూవీస్ కు షాక్ ఇచ్చిన వైజయంతి మూవీస్..

Prabhas Birthday: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి1, 2 తర్వాత సాహో.. రాధే శ్యామ్, కల్కి, సలార్, ఆది పురుష్, రాజా సాబ్ వంటి సినిమాల్లో ప్రభాస్ కనిపించారు. తన మార్కెట్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లారు. తనతో సినిమా అంటే వసూళ్లు వందల కోట్లు అనే లెక్క అనే బెంచ్ మార్క్ ను ప్రభాస్ సృష్టించుకున్నారు. సాధారణంగా ప్రభాస్ జన్మదినమంటే ఆయన చిత్రాలకు […]

Prabhas Birthday: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి1, 2 తర్వాత సాహో.. రాధే శ్యామ్, కల్కి, సలార్, ఆది పురుష్, రాజా సాబ్ వంటి సినిమాల్లో ప్రభాస్ కనిపించారు. తన మార్కెట్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లారు. తనతో సినిమా అంటే వసూళ్లు వందల కోట్లు అనే లెక్క అనే బెంచ్ మార్క్ ను ప్రభాస్ సృష్టించుకున్నారు.

సాధారణంగా ప్రభాస్ జన్మదినమంటే ఆయన చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ విడుదలవుతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2(ఇంకా షూటింగ్ మొదలవలేదు) వంటి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తీసే సినిమాలు. ఈ సినిమాలన్నిటిమీద అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలలో కల్కి.. సలార్ మొదటి పార్ట్ లు విడుదలై.. భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇటీవల ఫౌజీ సినిమాకు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఒక కీలకమైన విషయాన్ని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన దొంగ నా కొడుకు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తామని వెల్లడించారు. కానీ ఇంతవరకు ఆ నిర్మాణ సంస్థ నుంచి అప్డేట్ రాలేదు. బహుశా సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే మైత్రి కంటే ముందుగానే వైజయంతి మూవీస్ ప్రభాస్ అభిమానులకు దిమ్మ తిరిగిపోయే కానుక ఇచ్చింది. ప్రభాస్ జన్మదినమైన అక్టోబర్ 23 ఉదయమే కల్కి రెండవ భాగానికి సంబంధించి ఒక చిన్న వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో ప్రభాస్ 6 అడుగుల ఆజానుబాహుడిలాగా దర్శనమిస్తున్నారు. భైరవ పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడు నాగ్ అశ్విన్ 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో చూపించారు. ప్రభాస్ ఎత్తైన జుట్టు.. అదే స్థాయిలో కాస్ట్యూమ్ తో కనిపించారు. పైగా ప్రభాస్ ఈ పాత్ర కోసం బరువు తగ్గినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయన చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే కల్కి మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదటి భాగంలో ప్రభాస్ పాత్ర అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు అనే విమర్శలు వచ్చాయి. అయితే రెండవ భాగంలో మాత్రం ప్రభాస్ కేంద్రంగానే కథ సాగుతుందని డార్లింగ్ అభిమానులకు నాగ్ అశ్విన్ ఇండికేషన్ ఇచ్చారు. మొత్తానికి డార్లింగ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా కాలర్ ఎగరేసే విధంగా ట్రీట్ ఇచ్చింది వైజయంతి మూవీస్. మరి ఈ విషయంలో మైత్రి మూవీస్ ఎటువంటి వీడియో విడుదల చేస్తుంది.. డార్లింగ్ అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతోంది.. అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper