Bigg Boss Telugu 8 : నామినేషన్స్ సమయంలో తప్పు మొత్తం తనవైపు ఉన్నా కూడా, తన క్యూట్ మాటలతో, ఎదుట ఉన్న వ్యక్తితో తనని తాను డిఫెండ్ చేసుకోవడం లో ప్రేరణని మించిన కంటెస్టెంట్ ఈ హౌస్ లో ఎవ్వరూ లేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన కూడా తప్పు అని ఒప్పుకోదు ఈమె. పైగా తానూ ఎలాంటి తప్పు చేయలేదు అనే విధంగా వాదించుకొని జనాలకు అర్థమయ్యేలా చేస్తూ ఉంటుంది. కానీ సోనియా మాత్రం ప్రేరణ కి పట్టపగలే చుక్కలు చూపించింది అని చెప్పొచ్చు. ఈ ఈసారి భిన్నమైన విధంగా నామినేషన్స్ జరిపించాలనే ఉద్దేశ్యంతో, మొదటి వారం నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరిని హౌస్ లోపలకు పంపుతూ నామినేట్ చేయించాడు బిగ్ బాస్. అందరి కంటే ముందు సోనియా హౌస్ లోపలకు వచ్చి తన మొదటి నామినేషన్ గా ప్రేరణ ని వేస్తుంది.
ఆమె మాట్లాడుతూ ‘మెగా చీఫ్ గా అందరినీ సమానంగా చూసే బాధ్యత నీ మీద ఉంది. కానీ నువ్వు నబీల్, గౌతమ్ ఇద్దరు తప్పు చేసినప్పుడు నబీల్ కి ఫన్నీ శిక్ష ఇచ్చావు, కానీ గౌతమ్ కి మాత్రం కఠినమైన శిక్ష ఇచ్చావు. ఇదెక్కడి న్యాయం’ అని అంటుంది సోనియా. అప్పుడు ప్రేరణ మాట్లాడుతూ ‘శిక్ష అనేది చేసే తప్పుని బట్టి ఉంటుంది. నబీల్ కేవలం స్వీట్ మాత్రమే తిన్నాడు, కానీ గౌతమ్ బాధ్యతారాహిత్యంగా సీతాఫలం కాయలన్నీ తినేసాడు. నాకు ఇద్దరిలో గౌతమ్ తప్పు పెద్దది గా అనిపించింది కాబట్టే, అతనికి పెద్ద శిక్ష వేసాను’ అని అంటుంది ప్రేరణ. మధ్యలో గౌతమ్ కలగచేసుకొని ‘నేను బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాను అని ఎలా అంటావు’ అని చెప్పే ప్రయత్నం చేయగా, దానికి ప్రేరణ ఇది నా నామినేషన్, నేను డిఫెండ్ చేసుకుంటున్న, నువ్వు మధ్యలోకి రాకు అని అంటుంది.
ప్రేరణ చెప్పిన ఈ పాయింట్ చూస్తే, నబీల్ బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించాడు, అది ప్రేరణ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు జరిగింది. బాధ్యత ఆమె కూడా వహించాలి కాబట్టి, బిగ్ బాస్ నబీల్ కారణంగా ఈమెకు కూడా శిక్ష విదించొచ్చు. కానీ ప్రేరణ అసలు ఇది పెద్ద పాయింట్ కాదు అన్నట్టు మాట్లాడడం చూసే ఆడియన్స్ కి హాస్యాస్పదంగా అనిపించింది. అయితే నామినేషన్స్ లో వాదించుకుంటున్నప్పుడు ప్రేరణకి సెటైర్ గా మాట్లాడడం అలవాటు. అలా ఆమె సోనియా మీద ‘ఇప్పుడు దారిలోకి వచ్చినావా అక్క’ అని అంటుంది. సరే చెప్పి చెల్లి అని సోనియా అంటుంది. నువ్వు నాకు అక్క కాదు అమ్మా అని పొగరుతో శమందం చెప్తుంది ప్రేరణ. అలాంటప్పుడు ఎందుకు అక్కా అని పిలిచావు అని గట్టిగా అరుస్తుంది సోనియా. నిఖిల్ కి అక్క వి కాబట్టి చెప్తున్నా అని అంటుంది. అది మా ఇద్దరి మధ్య ఉంటుంది, మధ్యలో నువ్వు అక్కా అని పిలవడానికి కారణం ఏమిటి?, ఏ ఉద్దేశ్యంతో పిలిచావు అని సోనియా గట్టిగా మాట్లాడగానే ప్రేరణ నోటి నుండి మాటలు రాలేదు. మర్యాదగా క్షమాపణలు చెప్పు అని ప్రేరణ చేత మూడు సార్లు క్షమాపణలు చెప్పించుకుంది సోనియా.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Sonia enters the house and nominates prerana as her first nominee
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com