Singeetham Srinivas Rao: సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధుల్ని చేసిన సింగీతం శ్రీనివాసరావు మరోసారి మెగా ఫోన్ పడుతున్నాడు… తన 94 వ సంవత్సరంలో సినిమాని డైరెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… గతంలో ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని సైతం పెంచాయనే చెప్పాలి. ముఖ్యంగా కమలహాసన్ తో పుష్పక విమానం అనే సినిమాని చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు… ఇక విచిత్ర సోదరులు సినిమాలో కమలహాసన్ ను మరుగుజ్జు క్యారెక్టర్ లో చూపించి భారీ విక్టరీని సాధించాడు.
ఇక బాలయ్య బాబు లాంటి నటుడితో ‘ఆదిత్య 369’ లాంటి ఒక ఎక్స్పరిమెంట్ చేసి తన సత్తా చాటాడు. ఇక మొదటి ఇండియన్ టైం ట్రావెల్ సినిమాగా ఈ సినిమా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఆ తర్వాత భైరవద్వీపం లాంటి సినిమాని సైతం తెరకెక్కించి తను ఎలాంటి సినిమాల్ని అయిన సరే హ్యాండిల్ చేయగలను అని నిరూపించుకున్నాడు…
ఇలా ప్రస్తుతం ఆయన వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఈ సినిమా కథ మాత్రం చాలా కొత్తగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రోబోలకు – మనుషులకి మధ్య ఒక యుద్ధ వాతావరణం లో ఈ సినిమా సాగబోతుందంట.
ఫైనల్ గా ఎవరి మీద ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తుంది. మొత్తానికైతే సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైతే ఉంటుంది. ఈ సినిమాలో సైతం మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది… చూడాలి మరి తను ఎలాంటి సినిమా చేస్తాడు ప్రేక్షకులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది…