Shruti Haasan: ఈ కాలంలో లవ్ కామన్ గా మారింది. ఇక అందాల ప్రపంచం సినిమా ఫీల్డ్ లో మరింత ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ సెలబ్రెటీలు మాత్రం అంత ఈజీగా ఈ విషయాలను ఒప్పుకోరు. మీడియా కంట పడినా కూడా మాట దాటేస్తుంటారు కానీ రిలేషన్ లో ఉన్న విషయం ఒప్పుకోరు. అయితే ఇలాంటి జంటలు కొన్ని రోజుల తర్వాత నిశ్చితార్థం పెళ్లి అంటూ బాంబు పేలుస్తుంటారు. అదే విధంగా వరుణ్, లావణ్యల రిలేషన్ పై కూడా ఎన్ని రూమర్స్ వచ్చిన ముందుగా స్పందించని ఈ జంట తర్వాత పెళ్లితో షాక్ ఇచ్చారు. కానీ శృతి హాసన్ మాత్రం తన ప్రియుడి ఫోటోలను షేర్ చేసి డేర్ హీరోయిన్ అనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పటి వరకు ప్రియుడితో సీక్రెట్ గా కొనసాగించిన లవ్ స్టోరీనీ దీపావళి రోజు అందరికి చెప్పేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ త్వరలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి ఈ బ్యూటీ కూడా లవ్ లో ఉందనే వార్తలు వస్తున్నా.. వాటిపై ఎప్పుడు స్పందించలేదు. అయితే రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో సంప్రదాయ దుస్తులు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హాజారికతో చాలా కాలంగా రిలేషన్ లో ఉందట ఈ స్టార్ కిడ్.
గతంలో కూడా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది శృతి. ఇప్పటి వరకు వీరిద్దర మధ్య ఏదో ఉందనుకున్నారు నెటిజన్లు. కానీ ఇప్పుడు క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసుకోవడంతో అందరికి శృతి భాయ్ ఫ్రెండ్ అని నిర్ధారణకు వచ్చారట. ఇక ఇతనితో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఇతనే శృతికి కాబోయే భర్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. తలలో పూలు పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ శృతి హాసన్ ఇచ్చిన ఫోజులకు లైక్ ల వర్షం కురుస్తుంది. మరి వీరి రిలేషన్ పై క్లారిటీ రావాలంటే అమ్మడు స్పందించాల్సిందే.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Shruti haasan introduced the boyfriend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com