Bigg Boss 10 Telugu: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో విపరీతంగా వినిపిస్తున్న పేరు నందన. ఈమెకు యూట్యూబ్ లో ‘నందూస్ వరల్డ్’ అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్ ద్వారా ఈమె సంపాదించుకున్న ఫేమ్ , క్రేజ్ మామూలుది కాదు. ఈమె ఛానల్ ని 28 లక్షల మంది సబ్ స్క్రైబ్. ఈ ఛానల్ తో ఆమె సంపాదించుకున్న క్రేజ్ ద్వారా, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో ఒక కీలక పాత్ర కూడా పోషించింది. తొలిసినిమా నే భారీ హిట్ అవ్వడం తో , ఈమెకు ఇక తిరుగులేని ఇమేజ్ ఏర్పడింది, వరుసగా అవకాశాలు వస్తాయని అనుకుంటున్న సమయం లో ఆమె జీవితం లో ఊహించని మలుపు చోటు చేసుకుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల ఆశ చూపించి, తన భర్త తో కలిసి ఈమె లక్షల రూపాయిలు దొచ్చుకుందని రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుండి ఈమెపై కేసులు నమోదు అయ్యాయి. అయితే రీసెంట్ గానే ఈమెకు ‘బిగ్ బాస్ 10’ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. ఆ షో కోసం యూకే లో ఉన్న ఈమె ఇండియా కి తిరిగి వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెని వెంటనే శంషాబాద్ విమానాశ్రయం లో అరెస్ట్ చేసి విచారించారు. విచారణ పూర్తి అయ్యాక ఆమె బయటకు వచ్చిన విజువల్స్, మీడియా ఆమె పై ప్రశ్నల వర్షం కురిపించడం తో , నేనేమి చేయలేదు , మీ మీడియా పుట్టించిన పుకార్ల కారణంగానే నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ గొంతు చించుకొని నిన్న ఆమె అరిచిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఇంత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నందన ని బిగ్ బాస్ టీం ఇప్పుడు తీసుకుంటుందా లేదా అనే అనుమానం నెటిజెన్స్ లో ఏర్పడింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈమె బిగ్ బాస్ 10 లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇవ్వనుంది. వారానికి ఈమెకు 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందట బిగ్ బాస్ టీం. చీటింగ్ కేసులు ఉన్న ఇలాంటి సెలబ్రిటీ ని ‘బిగ్ బాస్ 10’ లోకి తీసుకొని సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది నవదీప్ సమాధానం చెప్పాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.