Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. సాధారణంగా మొదటి వారం లో టాస్కులు కఠినమైనవి ఇవ్వరు. చాలా సాధారణమైన టాస్కులు ఇస్తారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అప్పుడే 12 వ వారం లోకి వచ్చేశామా ? అనే రేంజ్ టాస్కులు పెడుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా వేరే లెవెల్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ , త్రిగున్ మధ్య ఏ రేంజ్ గొడవలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యం లో నిన్న శాశ్వత హౌస్ మేట్స్ అయ్యే టాస్క్ లో రోహిత్ , వంశీ లు గెలిచి హౌస్ మేట్స్ అవ్వడం తో ఇప్పుడు హౌస్ లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఇలాంటి ఉత్కంఠ నడుమ , ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే రోహిత్ , వంశీ హౌస్ కి శాశ్వత హౌస్ మేట్స్ గా మారిపోయారు. మరో టాస్క్ ని నిర్వహించి ఇంకో ఇద్దరు శాశ్వత ఇంటి సభ్యులను ఎంచుకుంటారు. మొత్తం మీద ఈ నలుగురికి ఒక టాస్క్ ని నిర్వహిస్తారు. ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఇంటికి కెప్టెన్ గా నిలుస్తారు. కంటెస్టెంట్స్ ఓటింగ్ ప్రకారం కెప్టెన్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తే వంశీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏ గ్రూప్ లోనూ లేడు , టీం స్పిరిట్ తో గేమ్స్ ఆడుతున్నాడు. అందరినీ సమానంగా చూస్తున్నాడు కాబట్టి , ఇతన్ని ఇంటికి మొదటి కెప్టెన్ గా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టాస్కుల ద్వారా కెప్టెన్ ని ఎంచుకునే ప్రక్రియ పెడితే , కచ్చితంగా రోహిత్ గెలిచే అవకాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి టాస్క్ గెలుపుతో ఆయన మంచి ఊపు మీద ఉన్నాడు.
పైగా తన బెస్ట్ ఫ్రెండ్ చరణ్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యాడు అనే బాధ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ కసి, బాధతో పని చేసే ఔట్పుట్స్ ఊహించని రేంజ్ లో వస్తాయ్. మరి రోహిత్ ఇకపై ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నాడా చూడాలి. మరి ee వారం కెప్టెన్ అయ్యే అవకాశాలు వంశీ కి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది , ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.