Sharwanand: ‘శతమానం భవతి’ చిత్రం తర్వాత హీరో శర్వానంద్(Hero Sharwanand) చేసిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. పైగా డిజాస్టర్ ఫ్లాప్స్ వరుసగా ఎదురయ్యాయి. దీంతో ప్రేక్షకులు శర్వానంద్ అనే హీరో ఇండస్ట్రీ లో ఉన్నాడు అనే విషయాన్నే మర్చిపోయారు. అలాంటి సమయం లో ఆయన నుండి విడుదలైన ‘నారీ నారే నడుమ మురారి’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రీసెంట్ గానే ఈ చిత్రం ఓటీటీ లో విడుదల అవ్వగా, అక్కడ కూడా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇలా మంచి కం బ్యాక్ ఇచ్చాడు కదా, ఇక మీదట మంచి కాంబినేషన్ సినిమాలు సెట్ చేసుకొని, ముందుకు దూసుకుపోతాడని అందరూ భావించారు. కానీ శర్వానంద్ రూటే సపరేటు. నాసిరకం రైటింగ్ తో ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన శ్రీను వైట్ల తో ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రీసెంట్ గానే వీళ్లిద్దరు కథ విషయం లో చర్చలు జరిపారని, శ్రీను వైట్ల శర్వానంద్ కి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ కథని వినిపించాడని, కథలో ఎమోషన్స్ తో పాటు, కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యిందని, కచ్చితంగా ఈ సినిమాతో శ్రీను వైట్ల కం బ్యాక్ ఉంటుందని, ఇలా చాలా రకాలా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి అవుట్ డేటెడ్ అయిపోయిన డైరెక్టర్ నుండి మనం అద్భుతాలను ఆశించలేము. శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ని చూడొచ్చు. ఆయన పాత తరహా మేకింగ్ స్టైల్ లోనే తీసాడు. కొన్ని కామెడీ సీన్స్ క్లిక్ అవ్వడంతో యావరేజ్ రేంజ్ లో ఆడింది.
అన్ని సార్లు అలా కామెడీ వర్కౌట్ అవుతుందని అనుకోలేము. కాబట్టి శ్రీను వైట్ల తో సినిమా అంటే, మరోసారి శర్వానంద్ తన కెరీర్ ని డేంజర్ లో పెట్టినట్టే. చూడాలి మరి ఏ నమ్మకం తో ఆయన ఈ సినిమా ఒప్పుకున్నాడు అనేది రాబోయే రోజుల్లో. ఇకపోతే శర్వానంద్ తదుపరి చిత్రం ‘బైకర్’. బైక్ రేసింగ్ కాన్సెప్ట్ మీద ఇండియా లో ఇప్పటి వరకు ఒక్క ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమా కూడా రాలేదు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని చూస్తుంటే ఈసారి కూడా శర్వానంద్ సూపర్ హిట్ కొట్టేలాగానే అనిపిస్తోంది. ఏప్రిల్ 4న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించాడు.