Homeఎంటర్టైన్మెంట్ఆ 3తో పాటు ఈ 2 కూడా ఓటీటీల్లోకే !

ఆ 3తో పాటు ఈ 2 కూడా ఓటీటీల్లోకే !

OTT Release Moviesకరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. థియేటర్లు కూడా అందుబాటులోకి వచ్చినా.. మరో రెండు నెలల వరకు థియేటర్ల బిజినెస్ ఫామ్ లోకి వచ్చేలా లేదు. అందుకే, కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాని ‘టక్ జగదీష్’, నితిన్ ‘మాస్ట్రో’, వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో విడుదలకు అంగీకరించాయి.

పై మూడు సినిమాలు ఓటీటీ కంపెనీలకు అమ్ముడుపోయాయి కూడా. నితిన్ ‘మాస్ట్రో’ త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ సినిమాకి బాగానే గిట్టుబాటు అయింది. నిజానికి ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు. అదే థియేటర్ రిలీజ్ అయి ఉంటే.. మరో చెక్ అయి ఉండేది. అప్పుడు నితిన్ కి ఉన్న ఆ మార్కెట్ కూడా దెబ్బ తినేది. మొత్తానికి ఓటీటీ నితిన్ కి బాగా కలిసొచ్చింది.

అలాగే ‘దృశ్యం 2’ (హాట్ స్టార్), ‘టక్ జగదీష్’ … సెప్టెంబర్ లో స్ట్రీమ్ కానున్నాయి. ఇదే బాటలో గోపీచంద్ నటించిన ‘సీటిమార్’, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’, శర్వానంద్ నటిస్తున్న ‘మహా సముద్రం’ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ‘సీటిమార్’, ‘మహా సముద్రం’ ఓటీటీ కంపెనీలతో చర్చలు కూడా మొదలుపెట్టాయి.

కానీ, ‘మహా సముద్రం’కు ఆశించిన స్థాయిలో ఆఫర్ రావడం లేదు. ‘సీటిమార్’కి 38 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. మరి త్వరలోనే ‘సీటిమార్’ రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ రానుంది. మొత్తానికి ఈ ఓటీటీ పరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. ఇక చిన్న, మధ్యస్థ చిత్రాలన్నీ ఆల్ రెడీ ఓటీటీ బాట పట్టేశాయి కాబట్టి, థియేటర్ల వ్యాపారానికి ఇప్పట్లో అనుకూలంగా లేనట్లే.

అయితే, ఈ ఓటీటీల విడుదల వ్యవహారం పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ వర్కర్లు సీరియస్ అవుతున్నారు. అయినా ఇంకా కరోనా పరిస్థితులు సద్దుమణగక పోతే.. ఏమి చేయాలి. ఇప్పుడు అంటే ఓటీటీ రూపంలో నిర్మాతలకు ఓ అవకాశం వచ్చింది. నష్టపోకుండా బయట పడటానికి మంచి అవకాశం దొరికింది అందుకే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పట్టించుకునే పరిస్థితిలో లేరు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper