Sara Alikhan: బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరిగా ప్రస్తుతం ముందుకు దూసుకెళ్తున్ హీరోయిన్లలో సారా అలీఖాన్ ఒకరు. కెరీర్లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. సోషల్‌మీడియాలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. తనకంట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేదార్నాథ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సారా.. అందులో తన నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత రణవీర్ సింగ్‌తో కలిసి నటించిన సింబా సినిమా.. సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో అగ్రకథానాయికల్లో ఒకరిగా దూసుకుపోయింది.
https://www.instagram.com/tv/CWGRB4fKogd/?utm_source=ig_web_copy_link
ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ మంచి యాక్టీవ్‌గా ఉంటోంది. అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ.. వారిని అలరిస్తుంటుంది. తాజాగా ముంబైలో తన ఫ్యాన్స్‌ను కలుసుకున్న సారాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అభిమాని ఆమెకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ సమోసా పావ్‌ను ఇస్తున్నట్లుగా కనిపించింది. సమోసా తీసుకుని క్యూట్‌గా నవ్వుతూ ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పింది.
వీడియోలో సారాతో పాటు హీరో విక్కీ కౌషల్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సారా చివరగా వరున్ధావన్ నటించిన కూలీ నెంబర్.1 సినిమాలో నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్‌తో కలిసి సినిమాలు నటిస్తోంది.