
TRS Harish Rao: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఏం ప్రణాళికలు రచిస్తోందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు వివాదాస్పదమైన ఆరోగ్య శాఖకు హరీశ్ రావుకు కట్టబెట్టడం వెనుక మతలబు ఏముంటందని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఎవరికి కలిసి రాలేదు. మొదటి నుంచి విమర్శల మయమైన శాఖను ఇప్పుడు హరీశ్ రావు చేతిలో పెట్టడం వెనుక ఆంతర్యమేమై ఉంటుందనేది అందరిలో మిలియన్ డాలర్ల ప్రశ్న.
మొదటి నుంచి వైద్య ఆరోగ్య శాఖ వివాదాస్పదమవుతూనే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తాటికొండ రాజయ్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించింది. తరువాత జరిగిన పరిణామాల్లో ఆయనను ప్రభుత్వం నుంచి తొలగించారు. తరువాత లక్ష్మారెడ్డి ని నియమించినా ఆయనపై కూడా విమర్శలు రావడంతో ఆయనను కూడా తప్పించారు.
తరువాత ఈటల రాజేందర్ ను ఆ శాఖలో కూర్చోబెట్టినా తరువాత పరిణామాలు తెలిసినవే. దీంతో ప్రస్తుతం హరీశ్ రావును(TRS Harish Rao) నియమించినా ఆయన భవితవ్యం ఏమిటన్నదే అందరిలో వస్తున్న సందేహం. ఆయనను కూడా కరివేపాకులా తీసివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ లో నేతలను మార్చే సంస్కృతికి పెద్దపీట వేసే పార్టీ హరీశ్ రావు విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
గతంలోనే ఈటల రాజేందర్ తనకు పట్టిన గతే హరీశ్ రావుకు పడుతుందని జోస్యం చెప్పిన తరుణంలో ప్రస్తుతం హరీశ్ రావుకు ఈ పదవి దక్కడంపై అందరిలో కూడా ఇదే అనుమానం వస్తోంది. హరీశ్ రావును కూడా పక్కన పెడతారనే భావన విశ్లేషకుల్లో వస్తోంది. ఈ నేపథ్యంలో పాపం హరీశ్ ఎలా బయట పడతారో వేచి చూడాల్సిందే.
Also Read: హరీష్ కు వైద్యఆరోగ్యశాఖ,, కేసీఆర్ సరికొత్త వ్యూహం అదేనా?