spot_img
Homeఎంటర్టైన్మెంట్Salaar: ప్రభాస్- నీల్ కాంబినేషన్ లో ‘సలార్’.. అడ్వాన్స్ బుక్సింగ్స్ లో రికార్డ్..

Salaar: ప్రభాస్- నీల్ కాంబినేషన్ లో ‘సలార్’.. అడ్వాన్స్ బుక్సింగ్స్ లో రికార్డ్..

Salaar: పాన్ ఇండియా స్టార్ గా పేరుగాంచిన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రానుందన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ , ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు భారీగా ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు.

డిసెంబర్ 22న క్రిస్మస్ పండుగ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మూవీ టీమ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకటో తారీఖున ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకులు, అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ చిత్రంపై ఫ్యాన్స్ మరింతగా ఎదురు చూస్తున్నారు.

సినిమా విడుదలకు మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో మూవీ టీమ్ తో పాటు హీరో ప్రభాస్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు సలార్ మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.. యూఎస్ లో ప్రీమియర్ లలో సలార్ హావా కొనసాగిస్తుందని సమాచారం. మూవీ రిలీజ్ కు ఇంకా సమయం ఉండగానే ప్రభాస్ అభిమానులు ఇప్పటి నుంచే వేయ్యి కళ్లతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దీంతో అడ్వాన్స్ సేల్స్ లోనే హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తుందని సమాచారం. దీన్ని బట్టి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సుమారు మిలియన్ మార్క్ ను దాటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక సినిమా విడుదలైతే రికార్డ్ కొల్లగొట్టడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయకగా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందించారు. హాలీవుడ్ రేంజ్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందోనన్న దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper