Cooku With Jathi Ratnalu 2: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకువెళ్తున్న షోస్ లో ఒకటి ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’. ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ కుకింగ్ షోలో , రుచికరమైన వంటకాలతో పాటు , జాతి రత్నాలు చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే ఈ షో కి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. మొదటి సీజన్ లో కేవలం 20 ఎపిసోడ్స్ ఉండగా , ఈ సీజన్ లో ఇప్పటి వరకు 30 కి పైగా ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఇక ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ తర్వాత సెమి ఫినాలే ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారం కానుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనే విషయం ఈపాటికే మీకు ప్రోమోల ద్వారా తెలిసే ఉంటుంది.
అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఏ ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ షో నుండి బయటకు వెళ్ళబోతున్నారు అనేది సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఈ షోలోకి వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన కృత్తిక , పునర్నవి భూపాళం ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యినట్టే. ముందుగా సుమిత్ ఎలిమినేట్ అయ్యాడు , ఆ తర్వాత శ్రవణ్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం మిగిలిన ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇలా వరుసగా వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అవ్వడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి శ్రవణ్ , కృత్తిక లకు మంచి క్రేజ్ ఉంది.
వీళ్లిద్దరు స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా యూత్ ఆడియన్స్ కి కూడా వీళ్లిద్దరు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి షోస్ లో వైల్డ్ కార్డు కాన్సెప్ట్ ని పెట్టకూడదని , ఒకవేళ పెట్టినా ఇలాంటి టాప్ కంటెస్టెంట్స్ ని పిలవకూడదు అని అంటున్నారు. వీళ్లిద్దరు వంట బాగా వండుతారు. ముఖ్యంగా శ్రవణ్ అయితే ఒక వారం టాప్ మార్కులను కూడా సంపాదించారు. అలాంటి వ్యక్తి కేవలం ఒక్క వారం బాగా తగ్గడం వల్ల ఎలిమినేట్ అయ్యారు , ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.