Homeఎంటర్టైన్మెంట్Ramayan Movie: 'రామాయన్' మొట్టమొదటి రివ్యూ.. ఈ డామినేషన్ అసలు ఊహించి ఉండరు!

Ramayan Movie: ‘రామాయన్’ మొట్టమొదటి రివ్యూ.. ఈ డామినేషన్ అసలు ఊహించి ఉండరు!

Ramayan Movie: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ పై అటు హిందీ ఆడియన్స్ లో , ఇటు తెలుగు ఆడియన్స్ లో అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో , ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, తెరకెక్కించారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. బాలీవుడ్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తీసి , రామాయణం ని చెడగొట్టారు అనే నిందని మోస్తోంది. ఆ నిందని […]

Ramayan Movie: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ పై అటు హిందీ ఆడియన్స్ లో , ఇటు తెలుగు ఆడియన్స్ లో అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో , ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, తెరకెక్కించారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. బాలీవుడ్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తీసి , రామాయణం ని చెడగొట్టారు అనే నిందని మోస్తోంది. ఆ నిందని నితీష్ తివారీ ‘రామాయన్’ చిత్రం తో తుడిపేయాలని ఫిక్స్ అయ్యినట్టు అనిపిస్తోంది. మొదట్లో విడుదల చేసిన టీజర్ లోని విజువల్ ఎఫెక్ట్స్ ని చూసి, ఇదేంటి 4000 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు , క్వాలిటీ చూస్తే సీరియల్ రేంజ్ లో ఉందని అంతా అనుకున్నారు. కానీ మొదటి ట్రైలర్ తో పర్వాలేదు విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయని ఒక క్లారిటీ వచ్చింది , ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే బాహుబలి స్టాండర్డ్స్ ని అందుకుంది.

కచ్చితంగా ఈ చిత్రం ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మూవీ లవర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ముంబై లోని ఒక థియేటర్ లో ప్రత్యేకంగా కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించారట మేకర్స్. ఈ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రావణుడిగా యాష్ తన నటవిశ్వరూపం చూపించాడట. కేజీఎఫ్ సిరీస్, టాక్సిక్ చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ బాగా అలవాటు పడడంతో , ఈ సినిమాలో రెచ్చిపోయాడట యాష్. శివానుగ్రహం తో రావణాసురుడు మూడు లోకాలను ఏలిన వీరుడు , అతనికి సాటి విశ్వం లో ఎవ్వరూ లేరు అనే విధంగా ప్రీ క్లైమాక్స్ వరకు ఆయన క్యారెక్టర్ ని తీర్చి దిద్దడారట. ఒక్క క్లైమాక్స్ లోనే రణబీర్ కపూర్ డామినేషన్ కనిపించిందని , అందులో కూడా యాష్ కి సానుభూతి కలిగేలా చాలా ఎమోషనల్ గా ఈ తెరకెక్కించారని అంటున్నారు.

రామాయణం కథలో గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉంటాయి. అవి మనకు పాత సినిమాల్లో కనిపిస్తాయి. కానీ కొత్తగా రామాయణం ని వెండితెర మీదకు తీసుకొని రావాలని అనుకున్న వాళ్ళు , ఆ ఎమోషన్ ని పండించలేకపోయారు. కానీ ఈ సినిమాలో నితీష్ తివారీ ఆ ఎమోషన్ ని పండించాడట. ప్రేక్షకులు కచ్చితంగా కంటతడి పెట్టుకుంటారని , రాముడిగా రణబీర్ కపూర్ , రావణాసురిడిగా యాష్ ఇద్దరూ కూడా అద్భుతంగా సూట్ అయ్యారని , నేటి తరం లో ఈ పాత్రలు వీళ్ళు తప్ప , ఇంకెవ్వరు చెయ్యలేరు అనేంతలా జీవించారని అంటున్నారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి. బాహుబలి 2 వసూళ్లను ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా అందుకోలేదు , కానీ ఈ సినిమాకు ఆ ఛాన్స్ ఉంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో ప్రారంభించారు. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 26 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది చాలా డీసెంట్ ఆరంభం అనే చెప్పాలి. పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే , వేరే లెవెల్ లో ట్రెండ్ ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. నవంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper