spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthikeya: స్టూడెంట్స్​తో సెల్ఫీలు దిగుతూ.. రాజా విక్రమార్క సందడి!

Karthikeya: స్టూడెంట్స్​తో సెల్ఫీలు దిగుతూ.. రాజా విక్రమార్క సందడి!

Karthikeya: ఆర్​ఎక్స్ 100 సినిమాతో హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ.  కాగా, కార్తికేయ హీరోగా తాన్య రవించ్రంద్రన్​ హీరోయిన్​గా నటిస్తోన్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు శ్రీ సిరిపల్లి.  తాజాగా, వీవీఐటీలో ఈ చిత్రయూనిట్​ సందడి చేసింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలను బుధవారం రాజా విక్రమార్క చిత్రయూనిట్‌ సందర్శించింది. ఈ క్రమంలోనే స్టూడెంట్స్​తో ముచ్చటించింది.

rx-100-movie-fame-hero-karthikeya-visited-student-of-vvit-collage

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. అద్భుతమైన సాంకేతిక హంగులతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. దర్శకుడు శ్రీ సరిపల్లికి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. ఎంతో నైపుణ్యంతో సినిమాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు జనాల్లో మంచి టాక్​ నడుస్తోంది. తన తొలి సినిమా నుంచి ప్రచారంలో భాగంగా వీవీఐటీని సందర్శించడం మాములైందని అన్నారు. కాగా, మరోవైపు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ.. మంచి కథతో ప్రేక్షకులనకు పరిచయమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నవంబరు 12న ఈ సినిమా విడుదల కానుందని అన్నారు. రాజా విక్రమార్క సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోనే విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ హీరో కార్తికేయ సందడి చేశారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Oktelugu Epaper