Chandu Mondeti and Surya : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మీడియం రేంజ్ డైరెక్టర్లు మాత్రం చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ‘కార్తీకేయ’ (Karthikeya) లాంటి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన చందు మొండేటి (Chandu Mondeti) ప్రస్తుతం నాగచైతన్య(Naga Chaithanya)తో తండేల్ (Thandel) అనే సినిమా చేశాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకోవడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ తన తదుపరి సినిమాని సూర్యతో చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే తండేల్ సినిమాకి రోజురోజుకీ టాక్ అయితే మారిపోతుంది. మొదట పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి రోజులు గడిచే కొద్ది ఈ సినిమాకు డివైడ్ టాక్ అయితే వస్తుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందా? భారీ కలెక్షన్స్ ని రాబడుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో సూర్య చందు మొండేటి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడా? తద్వారా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎలాంటి జానర్ లో రాబోతుంది. ఈ సినిమాతో వీళ్ళిద్దరికీ మంచి సక్సెస్ దక్కుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ డైరెక్టర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. కనక సూర్య తో సినిమా చేసినట్లయితే చందు మొండేటి కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతాడు. ఒకవేళ సక్సెస్ ని సాధిస్తే కనక పాన్ ఇండియాలో ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సూర్య వైవిధ్యమైన కథాంశాలను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
కాబట్టి చందు రాసుకున్న కథ వైవిధ్యాన్ని సంతరించుకొని ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన చందు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? లేదంటే హైప్ కోసమే ఇలాంటి వార్తలు వస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది…