Threequel Movies: సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సినిమా తెరకెక్కించడం ఎంత కష్టమో.. బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ టాక్ మాత్రం మేకర్స్ కు అంతకు మించిన సంతోషాన్ని ఇస్తుంది. సినిమాల కోసం ఎంతో మంది పని చేస్తారు. అందుకే సినిమా హిట్ అవ్వాలి అనుకుంటారు. లేదంటే డబ్బుతో, ప్రశాంతత కూడా ఉండదు. ఇదిలా ఉంటే తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం రీజనల్ సినిమాల వరకు మాత్రమే పరిమితం అయింది టాలీవుడ్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు పూర్తిగా మారింది.
Also Read: కాంతారావు 400 ఎకరాలు సంపాదించాడు కానీ ఏం లాభం…చివరి క్షణాలు అలా ముగిసిపోయాయి…
రీజనల్ తర్వాత సౌత్ ఇండియన్, ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమాలు, ఇప్పుడు ఏకంగా గ్లోబల్ సినిమా వరకు ఎదిగింది ఇండస్ట్రీ. సినిమాల రేంజ్ ఇలా పెరుగుతుంటే ప్రేక్షకులు కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఒక సినిమా హిట్ అయితే పక్కా ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుంటారు. కొన్ని సినిమాలకు ఏకంగా త్రీక్వెల్స్ కూడా వస్తున్నాయి. ఇలా పాన్ ఇండియా రేంజ్ దాటే చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సినిమాల గురించి ఓ సారి తెలుసుకుందామా.
పొలిమేర: సత్యం రాజేష్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా పొలిమేర. కోవిడ్ సమయంలో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కూడా సీక్వెల్ వచ్చింది. పొలిమేర 2 కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా బడ్జెట్ కాస్త తక్కువే అయినా బెస్ట్ గానే అందించారు అని టాక్ వచ్చింది. ఇక పొలిమేర సినిమా హిట్ తో సీక్వెల్ వచ్చింది. ఈ సినిమా హిట్ తో త్రీక్వెల్ కూడా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి సత్యం రాజేష్, బాలాదిత్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
కార్తికేయ: నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరుగా దూసుకొని పోతున్నాడు. కార్తికేయ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు మేకర్స్. ఫస్ట్ సినిమా మాదిరి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక అనుకున్నట్టుగానే కార్తికేయ విషయంలో త్రీక్వెల్ ఫార్ములాను ఫాలో అవుతుంది యూనిట్. తెలుగు సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ సూపర్ హిట్ అవ్వటంతో కార్తికేయ 2ను నేషనల్ లెవల్‌లో మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తికేయ 3 కోసం పక్కా పాన్ ఇండియా స్కెచ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నారట.
కాంతార: థియేటర్లలో గూస్ బాంబ్స్ ను తెప్పించిన సినిమా కాంతార. చిన్నసినిమాగా వచ్చిన ఈ సినిమా థియేటర్ లలో కలెక్షన్ల సునామీగా రికార్డు సొంతం చేసుకుంది. ఊహించని రేంజ్ లో హిట్ అయింది సినిమా. దీంతో కాంతార విషయంలోనూ త్రిబుల్ అనే కాన్సెప్ట్ వస్తుందట. ఈ సినిమాను ముందు రీజినల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్… లోకల్‌గా మంచి రెస్పాన్స్ రావటంతో ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. దీంతో సూపర రెస్పాన్స్ వచ్చింది. తొలి భాగం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావటంతో సీక్వెల్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్టుగానే ప్లాన్ చేశారట మేకర్స్. ఇలా ఒకే ఫ్రాంచైజీలో వస్తున్న సినిమాలన్నీ ఒక్కో పార్ట్‌తో తమ రేంజ్‌ను పెంచుకుంటూ పోతూ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరి ఈ సీక్వెల్, త్రీక్వెల్ లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Also Read: భారీ రేటు కు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటిటి రైట్స్…ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా…
Web Title: Upcoming tollywood threequel movies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com