RGV: ఆయన స్టైల్ పద్దతి పేరు.. ఎప్పుడూ ఓ చేతిలో ఓడ్కా.. మరో చేతిలో సినిమా.. ఆయనకు ఈ ప్రపంచం తప్ప ఇంకేం అక్కర్లేదు. అప్పుడ్ప్పుడూ స్టార్ హీరోలను, రాజకీయనాయకులను అంతెందుకూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఎప్పుడూ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంటాడు..వివాదాల్లో టాప్‌లో ఉంటాడు. ఆయనే రామ్‌గోపాల్ వర్మ. ఆయనకు సన్నిహితులు రాము అని పిలుస్తుంటారు.
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటి నుంచో ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ.. ఎన్నో జోనర్లలో గొప్పగొప్ప సినిమాలు తెరకెక్కించి హిస్టరీ క్రియేటర్‌గా ట్రెండ్ సృష్టించారు. ఎన్ని జోనర్లు చూసినిమా.. రామ్గోపాల్లో తరచూ కనిపించే అంశాలు క్రైమ్ అండ్ బ్యూటి ఆఫ్ ఉమన్. ఈ రెండంటే తనకు ఎంతో ఇష్టమని తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. ఆయన ఏ సినిమా చేసినా.. ఎవరోఒకరు కొత్త అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. అలా వారితో కొద్ది రోజులు డేటింగ్ కూడా చేస్తుంటారు.
https://twitter.com/_apsara_rani/status/1469290452637519872?s=20
అలా పరిచయం చేసిన వారిలో అప్సర రాణి ఒకరు. తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా బికినీ వేసుకుని ఎక్కడో నదిలో బాత్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. దాన్ని రీట్వీట్ చేసిన ఆర్జీవీ.. వావ్.. నువ్వు సూర్యుడి కంటే ఎంతో హాట్‌గా ఉన్నావు. కానీ, ఫారెస్ట్ ఎక్కడ ఉంది అని తనదైన స్టైల్లో కామెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం నెట్టింటలో ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతోనే ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.
ప్రస్తుతం కొండా సినిమా షూటింగ్లో ఉన్న ఆర్జీవీ.. మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేశాడు. లెస్బియన్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన డేంజరస్ ఒకటైతే.. మార్షల్ఆర్ట్స్ నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రూపొందించిన లడికీ. తెలుగులో అమ్మాయి సినిమా మరొకటి.