Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కులసంఘాలను పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో అసహనం పెరుగుతోంది. ఫలితంగా రోబోయే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నాయి. ఇటీవల కాలంలో కమ్మ సామాజిక వర్గం అయితే వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ వర్గం నేత చంద్రబాబును కాదని జగన్ ను గెలిపిస్తే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇందులో భాగంగా కమ్మ సామాజిక వరం జగన్ పై ఆగ్రహం పెంచుకుంటున్నారు.

పదవుల పంపకాల్లో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నట్లు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కమ్మలకు ప్రాధాన్యం కల్పించలేదు. దీంతో వారిలో ఆందోళన కలుగుతోంది. వైసీపీని రాబోయే ఎన్నికల్లో దూరం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కమ్మలను టార్గెట్ చేసుకుని వారి వ్యాపారాలపై దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిలో కోపం పెరుగుతున్నట్లు సమాచారం.
Also Read: పవన్ మరో పోరాటం.. మిత్రుడు బీజేపీకి సంకటం
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని తొక్కిపెట్టాలని కమ్మలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ర్టంలో కమ్మలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే వారికి పార్టీకి పట్టరాని కోపం వస్తున్నట్లు సమాచారం.
జగన్ తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారని చెబుతున్నారు. కమ్మలను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కమ్మలకు భవిష్యత్ లేకుండా చేస్తున్న జగన్ కు రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదని తెలుస్తోంది. వారి సామాజిక వర్గం నేత చంద్రబాబును ఎన్నుకుని తమ పనులు నెరవేర్చుకోవాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు