Homeఎంటర్టైన్మెంట్AP Temperatures: ఏపీలో మొదలైంది.. ఇక ‘ఉక్కపోతేనే...’

AP Temperatures: ఏపీలో మొదలైంది.. ఇక ‘ఉక్కపోతేనే…’

AP Temperatures: ఏపీలో( Andhra Pradesh) శీతాకాలం తుది దశకు చేరుకుంది. కేవలం రాత్రి మాత్రమే చలి ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. శివరాత్రి పర్వదినం నుంచి భానుడు సెగలు కక్కనున్నాడు. వేసవి ప్రారంభంలోనే సెగలు పుట్టిస్తున్నాడు. ఫిబ్రవరి రెండో వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారం వరకు చలి తీవ్రత ఉంటుంది. ఆపై ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉంటాయి. […]

AP Temperatures: ఏపీలో( Andhra Pradesh) శీతాకాలం తుది దశకు చేరుకుంది. కేవలం రాత్రి మాత్రమే చలి ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. శివరాత్రి పర్వదినం నుంచి భానుడు సెగలు కక్కనున్నాడు. వేసవి ప్రారంభంలోనే సెగలు పుట్టిస్తున్నాడు. ఫిబ్రవరి రెండో వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారం వరకు చలి తీవ్రత ఉంటుంది. ఆపై ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉంటాయి. కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పుడు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

* సంక్రాంతి తర్వాత క్రమేపి..
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు( temperatures ) పెరుగుతూ వచ్చాయి. అదే స్థాయిలో చలి తీవ్రత కొనసాగింది. విపరీతంగా పొగ మంచు పడింది. అయితే క్రమేపి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం మాత్రం గమనార్హం. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా కావలిలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. నరసాపురం,బాపట్ల, ఒంగోలు, కావలి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరగడం విశేషం. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా, యానంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గొచ్చు అని వాతావరణ శాఖ చెబుతోంది.

* కొనసాగుతున్న పొగ మంచు..
అయితే ఉత్తరాంధ్రలోని( North Andhra ) మన్యప్రాంతంలో ఇప్పటికీ పొగ మంచు కురుస్తూనే ఉంది. అల్లూరి జిల్లాలోని ముంచంగిపుట్టు, పాడేరు, అరకు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. సోమవారం రాష్ట్రంలో కొన్ని చోట్ల ఒక మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే గత ఏడాది వర్షాలు పడ్డాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. ఆ ప్రభావంతో చలి కూడా అదే స్థాయిలో వీచింది. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి ప్రారంభానికి ముందే ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో ఉంది. ఉక్కపోత తప్పదన్న సంకేతాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అయితే ఈ ఏడాది వేసవి గట్టిగానే ఉంటుందన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper