Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroes: రియాలెస్టిక్ సినిమాలు చేయడం మన హీరోల వల్ల అవ్వదా..?దానికి వాళ్ళే కరెక్టా..?

Tollywood Heroes: రియాలెస్టిక్ సినిమాలు చేయడం మన హీరోల వల్ల అవ్వదా..?దానికి వాళ్ళే కరెక్టా..?

Tollywood Heroes: ఒక సినిమా ప్రేక్షకుడిని అలరించాలి అంటే అందులో రియాలెస్టిక్ సన్నివేశాలు ఉండాలి. అలాంటప్పుడే ప్రేక్షకుడు ఆ మూవీని ఓన్ చేసుకుంటాడు. సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా ఆ సీన్లు ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటాయి. మరి అలాంటి మన హీరోలు రియాలెస్టిక్ సినిమాలను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఏదేమైనా కమర్షియల్ సినిమాల వైపే మనవాళ్ల అడుగులు పడుతున్నాయి. కాబట్టి వాటి ఆదరణ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇక తమిళ్, మలయాళం […]

Tollywood Heroes: ఒక సినిమా ప్రేక్షకుడిని అలరించాలి అంటే అందులో రియాలెస్టిక్ సన్నివేశాలు ఉండాలి. అలాంటప్పుడే ప్రేక్షకుడు ఆ మూవీని ఓన్ చేసుకుంటాడు. సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా ఆ సీన్లు ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటాయి. మరి అలాంటి మన హీరోలు రియాలెస్టిక్ సినిమాలను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఏదేమైనా కమర్షియల్ సినిమాల వైపే మనవాళ్ల అడుగులు పడుతున్నాయి. కాబట్టి వాటి ఆదరణ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇక తమిళ్, మలయాళం ఇండస్ట్రీల్లో ఉన్న స్టార్ హీరోలు సైతం రియాలెస్టిక్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతున్నారు.

చిన్న బడ్జెట్లో సినిమాని చేసి వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు. మన దగ్గర మాత్రం అలా ఎందుకు చేయడం లేదు. సహజంగా ఉండే సినిమాలంటేనే మన కుర్ర హీరోల దగ్గర నుంచి టాప్ హీరోల వరకు అందరు భయపడిపోతున్నారు. కారణం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం విశేషం…

ఇక మన హీరోలందరు ఫాంటసీలో బతుకుతున్నారు. హీరో కొడితే నలుగురు కింద పడాలి అనే ఒక కమర్షియల్ ఎలిమెంట్ ని నమ్ముకునే ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందువల్లే ఎవ్వరు కూడా నాచురల్ ఎలిమెంట్స్ తో ఉండే సినిమాల వైపు అడుగులు వేయడం లేదు…మొదట ఒక సినిమాతో సక్సెస్ వస్తే చాలు సెకండ్ సినిమాకి మాస్ జపం చేస్తున్నారు.

మరి మాస్ లో వాళ్లు ఎంత వరకు రాణించగలుగుతారు అనే విషయాన్ని పక్కన పెట్టి మరి వాళ్ళు అలాంటి సాహసాలైతే చేస్తున్నారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది చేతులు కాల్చుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇతర ఇండస్ట్రీలో ఉన్న హీరోలను ఆదర్శంగా తీసుకొని మనవాళ్లు కూడా నాచురల్ గా ఉండే క్యారెక్టర్ లను చేస్తే బాగుంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper