Homeఆధ్యాత్మికంToday 13 February 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈ రోజు అధిక...

Today 13 February 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈ రోజు అధిక ధన ప్రయోజనం..

Today 13 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఉండడంతో అత్యధిక ధన ప్రయోజనం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు చురుగ్గా పనిచేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టడానికి ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రాజెక్టులలో పూర్తి చేయడంలో తోటి వారితో సంయమనం పాటించాలి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు సానికూర ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు శుభవార్తలను వింటారు. పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ లెటర్ అందుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం కావడంతో వారితో ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు వ్యాపారాలు ఎప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరడానికి అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవు తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకునేవారు అధికారుల మద్దతు పొందాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండడంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా వస్తాయి. వీరికి కొత్త భాగస్వాములు తోడు కావడంతో మరింతగా ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రాయణాలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు డబ్బు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ప్రాజెక్టులను చేపట్టే ముందు ఉద్యోగులు అధికారులను సంప్రదించాలి. వ్యాపారులకు ఈరోజు సానుకూలపైన ఫలితాలు ఉండనున్నాయి. గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని ధన లాభం ఉండే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కొత్త పెట్టుబడులు పెడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో వీటి నుంచి బయటపడతారు. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడును పెడతారు. వీరికి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper