Homeఎంటర్టైన్మెంట్Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో ‘రామాయణ’ అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రను సన్నీ డియోల్ కు అప్పగించారు. అయితే ఈ సినిమాపై రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో యశ్ బీభత్సకాండ ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ యశ్ గురించి రణభీర్ ఏం చెప్పాడంటే? కన్నడ స్టార్ యశ్ పై […]

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో ‘రామాయణ’ అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రను సన్నీ డియోల్ కు అప్పగించారు. అయితే ఈ సినిమాపై రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో యశ్ బీభత్సకాండ ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ యశ్ గురించి రణభీర్ ఏం చెప్పాడంటే?

కన్నడ స్టార్ యశ్ పై బాలీవుడ్ ప్రముఖ స్టార్ రణబీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పటి నుంచో యశ్ కి పెద్ద అభిమానిని అని.. రావణుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారని పేర్కొన్నాడు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాముడు, రావణుడు చేసే యుద్ధం తెరపై చూడాలని ఎదురు చూస్తున్నానని కొనియాడారు..

రాముడు, రావణుడి యుద్ధ ఘట్టాలు ఈ సినిమా రెండో పార్ట్ లో చూస్తారని.. ఆ సీన్లు చూడడానికి రెండు కళ్ళు చాలవని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే యుద్ధం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అయితే ఇందులో రావణుడి పాత్రలో యశ్ తనదైన శైలిలో నటించి మెప్పించాలని పేర్కొన్నారు. అంతకుముందే యశ్ సినిమాలు అంటే ఇష్టమని.. అప్పుడే అభిమానిని అయిపోయానని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయనతోనే నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇందులో రావణుడి పాత్రలో యశ్ నీ చూస్తే నిజాయితీ ఎక్కువగా కనిపిస్తుందని.. గతంలో ఉన్న రావణుడిలా ఉండడని అన్నారు. రాముడు, రావణుడు చేసే యుద్ధాలు తెరపై చూడడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇదిలా ఉండగా రామాయణ మూవీ మొదటి పార్ట్ దీపావళి కి విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళి లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో నార్త్, సౌత్ బిగ్ యాక్టర్లు నటించడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. పౌరాణిక చిత్రం అయినప్పటికీ ఇందులో భారీ విజువల్స్ తో పాటు ఆసక్తిని గొలుపే సీన్లను కూడా ఉంచడంతో ఇదొక అద్భుత ఘట్టం అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper