Homeఎంటర్టైన్మెంట్Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు కూడా ఈ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం చాలా అరుదు. అందులోనూ ఆ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరం. ప్రముఖ నటుడు నాని తో జతకట్టిన ఓ హీరోయిన్ భర్త కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రముఖ నటుడే. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇంతకీ వారిద్దరూ ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

ప్రముఖ నటుడు నాని హీరోగా వచ్చిన ‘ పిల్ల జమిందార్’ సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. యావరేజ్ మూవీ అయినప్పటికీ ఇది అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వీరిలో ఒకరు బిందు మాధవి కాగా.. మరొకరు హరిప్రియ. అయితే ఈమెకు అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 2013లో వచ్చిన అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్ అనే మూవీలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇవే కాకుండా కన్నడ చిత్ర సీమలో ఉగ్రం, రన్న, రిక్కీ వంటి సినిమాలను చేసి గుర్తింపు పొందారు.ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది.

అయితే హరిప్రియ భర్త కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడే. ఆయన పేరు వశిష్ట ఎన్ సింహ. ఈయన ఎక్కువ కన్నడ చిత్రాల్లో నటించారు. నెగిటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో నారప్ప అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఓదెల సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య ఒక ప్రముఖ హీరోయిన్ అని ఎవరికి తెలియదు అని షాకింగ్ విషయం చెప్పాడు. అయితే హరిప్రియ, వశిష్టలది ప్రేమ వివాహం. 2020లో వశిష్ట సింహ హరిప్రియ కు ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ తరుణంలో వశిష్ట లోని కొన్ని మంచి లక్షణాలను తన తండ్రి గుర్తించడంతో ఆయనకు దగ్గరయ్యారని పేర్కొంది. కొంతకాలం వీరు ప్రేమించుకున్న తర్వాత 2023 జనవరి 26న మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే తెలుగులో వచ్చిన పిల్ల జమిందార్ హీరోయిన్ హరిప్రియ వశిష్ట భార్య అని చాలామందికి తెలియదు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూ తో ఈ విషయం బయటపడడంతో ఆసక్తి చూపుతున్నారు. తెరపై సింధుగా కనిపించిన ఈమె నిజజీవితంలో సింహపురిగా మారిపోయిందని కొందరు ఆసక్తిగా పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Zomato Anniversary Campaign

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....
Oktelugu Epaper