Homeఎంటర్టైన్మెంట్Peddhi Ray Ray Ra song : 'పెద్ది' మూవీ 'రయ్ రయ్ రారా'...

Peddhi Ray Ray Ra song : ‘పెద్ది’ మూవీ ‘రయ్ రయ్ రారా’ సాంగ్ రివ్యూ.. మంచి మాస్ బీట్ సాంగ్ అనుకుంటే ఇలాంటిది వదిలాడేంటి!

Peddhi Ray Ray Ra song :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం పై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటనే వినిపిస్తోంది. ఈమధ్య కాలం లో స్టార్ హీరోల పాటల్లో ‘పుష్ప 2 ‘ తర్వాత ఆ రేంజ్ వైరల్ అవ్వడం ‘పెద్ది’ చిత్రానికే జరిగింది. దీంతో ఈ సినిమా ఆల్బమ్ పై యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. AR రెహమాన్ మంచి ఫార్మ్ మీద ఉన్నాడు, ఇక నుండి విడుదలయ్యే ప్రతీ పాట అద్భుతంగా ఉండబోతుంది అని అనుకున్నారు. అలాంటి అంచనాలతోనే ఈ చిత్రం లోని రెండవ పాట ‘రయ్ రయ్ రారా’ కోసం ఎదురు చూసారు. నేడు సాయంత్రం 7 గంటలకు విడుదల అవ్వాల్సిన ఈ పాట బాగా ఆలస్యం అయ్యింది. ఇప్పటికీ కూడా లిరికల్ వీడియో సాంగ్ రాలేదు .

కానీ ‘స్పాటిఫై ‘ మ్యూజిక్ యాప్ లో ఆడియో సాంగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ సాంగ్ విన్న తర్వాత ఫ్యాన్స్ నుండి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది లిరిక్స్ బాగున్నాయని అంటున్నారు, మరి కొంతమంది అయితే ‘చికిరి చికిరి’ పాటకు దరిదాపుల్లో కూడా లేదు, మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ అని ఊహిస్తే, క్లాస్ పీకే సాంగ్ ని వదిలారు ఏంటి ?, అసలు AR రెహమాన్ ఈ పాట పాడడం అవసరమా ?, హిందీ పాటను తెలుగు లో డబ్ చేసినట్టుగా ఉంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ నిజంగానే ఈ పాట ట్యూన్ వేరే లెవెల్ లో లేదు. ‘చికిరి చికిరి ‘ విన్న తర్వాత ప్రతీ ఒక్కరూ అంతకు మించిన సాంగ్ రావాలని కోరుకుంటారు. విడుదల తర్వాత అంతకు మించి లేకపోయినా కనీస స్థాయిలో ఉన్నా పర్లేదు , సర్దుకుంటారు. కానీ ఈ సాంగ్ ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి.

అయితే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్ స్టెప్పులతో ఇరగకుమ్మేశాడని అంటున్నారు. ఆయన స్టెప్పులు అభిమానుల అంచనాలకు చేరుకోగలిగితే ఈ పాట కూడా పెద్ద హిట్ అవుతుంది. లేదంటే యావరేజ్ రేంజ్ లో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాటికి లిరికల్ వీడియో సాంగ్ వచ్చేయాలి. కానీ ఇప్పటి వరకు రాలేదంటే , ఈరోజు ఇక లేనట్టే అనుకోవచ్చు. చూడాలి మరి రేపు ఉదయం అయినా ఈ పాట యూట్యూబ్ లోకి అందుబాటులోకి వస్తుందా లేదా అనేది. అయితే స్పాటిఫై కి సంబంధించిన ఆడియో సాంగ్ లింక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper