Homeఎంటర్టైన్మెంట్Ram Charan daughter Klin Kaara: రామ్ చరణ్ కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన...

Ram Charan daughter Klin Kaara: రామ్ చరణ్ కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు క్లిన్ కారా.. ఇంత చిన్న వయస్సులో ఎంత పెద్ద మనసు..

Ram Charan daughter Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఎందుకో అందరికీ తెలిసిందే. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఏ పని మీద అయినా మనస్ఫూర్తిగా శ్రద్ద […]

Ram Charan daughter Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఎందుకో అందరికీ తెలిసిందే. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఏ పని మీద అయినా మనస్ఫూర్తిగా శ్రద్ద పెట్టి , తమ వైపు నుండి నూటికి నూరు శాతం ది బెస్ట్ ఇచ్చి , ఆ పని ని ఎదుటివాళ్ళు మెచ్చుకుంటే వచ్చే కిక్కే వేరు. రామ్ చరణ్ ప్రస్తుతం అలాంటి కిక్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘పెద్ది’ చిత్రం లో ఆయన ఎంత కష్టపడ్డాడో మన కళ్లారా చూశాము . ఆరంభం నుండి ఎండింగ్ వరకు రామ్ చరణ్ కష్టం , అద్భుతమైన నటన మాత్రమే కనిపించింది.

సినిమాని తన రెండు భుజాల మీద మోశాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ రేంజ్ నటన ఈమధ్య కాలం లో స్టార్ హీరోల నుండి రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా నటించాడు రామ్ చరణ్. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకొని పోవడానికి ముఖ్య కారణం , రామ్ చరణ్ మాత్రమే. ఇకపోతే ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా , తన తండ్రి కి ఒక స్వీట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ చిన్నారి మాట్లాడుతూ ‘నాన్న.. థిస్ ఈజ్ ఫర్ యూ.. లవ్ యూ సో మచ్’ అంటూ ఒక వీడియో ని చేయించింది. తన ఇంట్లో పని చేసేవాళ్లను , తన తండ్రి స్టాఫ్ ని , బాడీ గార్డ్స్ ని అందరినీ ఒక దగ్గరకు చేర్చి ‘చికిరి చికిరి’ పాటకు డ్యాన్స్ చేయించింది.

వీరిలో రీసెంట్ గా బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి రామ్ చరణ్ బాడీ గార్డ్ ‘కెవిన్’ కూడా ఉన్నాడు. ఈ వీడియో ని సోషల్ మీడియా లో ఉపాసన షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు , క్లిన్ కారా వాయిస్ చాలా ముద్దుగా ఉందని, ఆ చిన్నారి కి ఇంత చిన్న వయస్సు లో తన తండ్రికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రావడం అద్భుతం అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper