Homeటాప్ స్టోరీస్Telangana land issues : తెలంగాణలో భూమి కొన్నా.. అమ్మినా.. అది ఒక పెద్ద 'సాహస...

Telangana land issues : తెలంగాణలో భూమి కొన్నా.. అమ్మినా.. అది ఒక పెద్ద ‘సాహస యాత్రే’!

Telangana land issues : తెలంగాణలో భూముల దందా… సారీ, భూముల వ్యవహారం అద్భుతం! ప్రభుత్వం మారినా పోర్టల్ పేరు మారినా రైతుల కష్టాలు మాత్రం ‘ఎటర్నల్’ అన్నట్టు సాగుతున్నాయి. ధరణి పోయి భూ భారతి వచ్చింది. కానీ పాత సమస్యలే కొత్త వేషంలో మళ్ళీ దర్శనమిస్తున్నాయి. పేరు మారిస్తే జాతకం మారుతుందని నమ్మే మన పాలకులకు.. సాఫ్ట్‌వేర్ కూడా అంతే అనిపిస్తుందేమో!

పాత డొల్ల.. కొత్త నొల్ల!

‘ధరణి’లో వంద రకాల సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరిస్తామని వచ్చిన ‘భూ భారతి’లో కొత్తగా లొసుగులు బయటపడుతున్నాయి. అంటే పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తవి బోనస్‌గా వస్తున్నాయన్నమాట. ఇదో రకమైన ‘డబుల్ బొనాంజా’ రైతులకు!

‘ఫీజు’ వసూలు.. ‘తిరిగి ఇవ్వడం’ జాప్యం!

ధరణి ఉన్నప్పుడు స్లాట్ రద్దు చేసుకుంటే కట్టిన డబ్బులు తిరిగి రావడానికి అంతులేని జాప్యం జరిగేది. ఇప్పుడు భూ భారతి వచ్చాక కూడా అదే పరిస్థితి. ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోవడం తెలుసు.. కానీ తిరిగి ఇవ్వడం కొంచెం ‘కష్టం’ కదా మరి!

ఏజెంట్ల రాజ్యం.. సర్కార్‌కు ‘కన్నం’!

ఇక అతిపెద్ద కామెడీ ఏంటంటే… మీ సేవ ఏజెంట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలను జేబులో వేసుకుంటుంటే సర్కార్ దాన్ని అడ్డుకోలేకపోతోంది. తహశీల్దార్లకు ఆ ఛార్జీలను చూసే అవకాశం లేకపోవడంతో ఏజెంట్లు కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం చుక్కెదురు. వరంగల్ పోలీసులే రంగంలోకి దిగి అరెస్టులు చేసే వరకు ఈ వ్యవహారం సర్కారుకు తెలియకపోవడం, వారి ‘పనితీరుకు’ అద్దం పడుతోంది.

ఆరు నెలలు.. ఆశల ‘సమాధి’!

ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడానికి, భూ భారతి పోర్టల్ పక్కాగా మారడానికి మరో ఆరు నెలలు పడుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. అంటే అప్పటివరకు రైతుల తిప్పలు యథాతథమే! పేరు మార్చి ప్రజలను బురిడీ కొట్టించడం కాకుండా సమస్యల మూలాలను పట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ధరణిలో సమస్యలు ఉంటే భూ భారతి తెచ్చారు, మరి భూ భారతిలో సమస్యలు ఉంటే ఏం తెస్తారు? ‘భూ నరకం’? ఏది ఏమైనా తెలంగాణలో భూమి కొన్నా, అమ్మినా.. అది ఒక పెద్ద ‘సాహస యాత్రే’!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Vijay

Vijay: విజయ్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేది ఆయనేనా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు విజయ్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లిపోయాడు. కాబట్టి తను సినిమాలు చేసే అవకాశామైతే లేదు. ఇక రీసెంట్...
Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Oktelugu Epaper