గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా రెండు డిజాస్టర్స్ ని ఎదురుకున్న రామ్ చరణ్ , ఈ సినిమా సక్సెస్ తో మరోసారి ఆయన రేస్ లోకి దూసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించారు. అయితే ఈ చిత్రం తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు అవ్వడానికి బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న టాక్. సుకుమార్ చెక్కుడు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఒక సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తారు. నాలుగైదు వెర్షన్ లు రాసుకొని , ఆయన పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతనే సెట్స్ మీదకు తీసుకొస్తారు. ‘పుష్ప’ సిరీస్ కి అదే చేశారు , ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకు కూడా అదే చేస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ దసరా నుండి మొదలు అవ్వబోతుందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు డిసెంబర్ అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అటు ఇటు అయితే వచ్చే ఏడాదికి షూటింగ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే 2027 లో రామ్ చరణ్ నుండి సినిమా రావడం అసాధ్యం అనే అనుకోవాలి. 2028 చివర్లోనే ఆయన సినిమా చూడొచ్చు. సుకుమార్ షూటింగ్ కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు కాబట్టి 2029 లో ఈ చిత్రం విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మొత్తానికి రామ్ చరణ్ వెండితెర పై కనిపించడానికి మరో రెండేళ్ల సమయం పెట్టొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఆయన అభిమానులు చేదు వార్త అనే చెప్పాలి. రామ్ చరణ్ కి సూపర్ స్టార్ డమ్ ఉన్నప్పటికీ కూడా, సినిమాలు చేయడానికి బాగా ఎక్కువ సమయం తీసుకుంటారని అభిమానుల నుండి వచ్చే కంప్లైంట్. ఇలా అయితే కెరీర్ ముగిసే సమయానికి కనీసం 30 సినిమాలు కూడా చెయ్యలేరని అభిమానుల ఆవేదన. పెద్ది తర్వాత అయినా లెక్క మారుతుంది అనుకున్నారు , ఇప్పటికీ ఆయన సినిమాలు చేసే విషయం లో నత్తనడకనే అనుసరిస్తున్నారు. సుకుమార్ తర్వాత రామ్ చరణ్ రాజమౌళి తో ఒక సినిమా చేయబోతున్నారని టాక్. ఇక ఈ సినిమాకు ఎన్ని ఏళ్ళ సమయం తీసుకుంటారో చూడాలి.







