Homeక్రీడలుక్రికెట్‌India breaks records: వెస్టిండీస్ మీద విజయమే కాదు.. టీమిండియా బద్దలు కొట్టిన ఈ రికార్డులు...

India breaks records: వెస్టిండీస్ మీద విజయమే కాదు.. టీమిండియా బద్దలు కొట్టిన ఈ రికార్డులు తెలుసా?

India breaks records: కోల్ కతా లో జరిగిన టి20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. టీమిండియాలో ఓపెనర్ సంజు శాంసన్ 97* పరుగులు చేసి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా టీమిండియాను సెమీఫైనల్ దాకా తీసుకెళ్లాడు.

కోల్ కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే వేదిక మీద అత్యధిక టి20 విజయాలను నమోదు చేసింది. కరాచీలో వెస్టిండీస్ తో జరిగిన ఆరు మ్యాచ్లను పాకిస్తాన్ గెలుచుకుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ జట్టు మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో టీమ్ ఇండియా కొనసాగుతోంది. మలహైడ్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన ఆరు మ్యాచ్లను టీమిండియా గెలుచుకుంది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్లలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. హరారే వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్లను న్యూజిలాండ్ గెలిచింది. లాహోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన ఐదు మ్యాచ్లను పాకిస్తాన్ గెలిచింది. రావల్పిండి వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లను పాకిస్తాన్ గెలిచింది. కోల్ కతా వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్లను భారత జట్టు సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్లో 97 పరుగులు చేసిన సంజు దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా సురేష్ రైనా కొనసాగుతున్నాడు. ఇతడు గ్రాస్ హైలెట్ వేదికగా 2010లో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 101 పరుగులు చేశాడు. కోల్ కతా లో ఆదివారం జరిగిన మ్యాచ్లో సంజు 97* పరుగులు చేశాడు. 2024లో గ్రాస్ హైలెట్ వేదికగా ఆసిలే జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ 92 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో వెస్టిండీస్ జట్టుతో ముంబైలో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 89* పరుగులు చేశాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2026 లో ముంబై వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ 84* పరుగులు చేశాడు.

Also Read: టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. సంజు శాంసన్ చేసిన పనికి అందరూ ఫిదా!

వెస్టిండీస్ విధించిన 196 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించిన టీమిండియా మరో ఘనత సొంతం చేసుకుంది. 2016లో సౌత్ ఆఫ్రికా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండు ఫినిష్ చేసింది. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2007లో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తద్వారా రెండో స్థానంలో కొనసాగుతోంది. 2026 లో వెస్టిండీస్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని చేదించి.. మూడో స్థానంలో నిలిచింది. 2024లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో కెనడా విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా విజయవంతంగా చేదించి.. నాలుగో స్థానంలో నిలిచింది. 2016లో ఇండియా విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ విజయవంతంగా పూర్తి చేసింది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

ఆరోసారి సెమీఫైనల్ వెళ్లి టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో పాకిస్తాన్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2007, 2009, 2010, 2012, 2021, 2022 సంవత్సరాలలో జరిగిన టి20 వరల్డ్ కప్లలో పాకిస్థాన్ సెమీఫైనల్ వెళ్ళింది. 2007, 2014, 2016, 2022, 2024, 2026 సంవత్సరాల లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ వెళ్ళింది. వరుసగా మూడు టోర్నీలలో సెమి ఫైనల్ వెళ్లి టీమిండియా చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్ కూడా 2010, 2016, 2021, 2022, 2024, 2026 సంవత్సరాలలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ వెళ్ళింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular