ఎంటర్టైన్మెంట్Ram Charan Buchi Babu: రామ్ చరణ్ - బుచ్చి బాబు మూవీ కథ రాయడానికే...

Ram Charan Buchi Babu: రామ్ చరణ్ – బుచ్చి బాబు మూవీ కథ రాయడానికే అన్ని కోట్లు ఖర్చు చేశారా..? ప్లానింగ్ అంటే ఇది!

Ram Charan Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ #RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన సినిమా కోసం కేవలం మెగా అభిమానులు, తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఇక నుండి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. టైటానిక్, అవతార్ వంటి వెండితెర దృశ్య కావ్యాలను తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్ లాంటి దర్శకులు కూడా రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారంటే ఆయన క్యాలిబర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ కి సరైన బ్లాక్ బస్టర్ పడితే రికార్డ్స్ విషయం లో ఆయనకి పోటీ ఇచ్చేవాళ్ళు లేరని ట్రేడ్ పండితులు సైతం చెప్పే మాట. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. క్రిస్మస్ లేదా సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఈ దసరా కి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది. అభిమానులు ‘గేమ్ చేంజర్’ చిత్రం కంటే ఎక్కువగా ఈ సినిమా మీదనే అంచనాలు పెట్టుకున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈమె ‘దేవర’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. అందం లోనూ, నటనలోనూ డ్యాన్స్ లోనూ ఈమె తెలుగు ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకుంది.

ఇక ఈ చిత్రం లో ఆమెకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందట. అలాగే ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు, తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని టాక్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా కథ రాయడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడట డైరెక్టర్ బుచ్చి బాబు. రచయితగా మంచి అనుభవం ఉన్నవాళ్లను తన బృందం లోకి తీసుకున్నాడట. దీని మీద ఆయన ఎన్నో పరిశోధనలు కూడా చేసాడట. రామ్ చరణ్ క్యారక్టర్ ని డిజైన్ చేసేందుకు చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఆయన నటన ఇందులో ‘రంగస్థలం’ ని మించి ఉంటుందని సమాచారం. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. రామ్ చరణ్ కూడా తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో ఆ ఇద్దరు సీనియర్ హీరోలు…

Ram Charan Sukumar Movie: సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న నటుడు రామ్ చరణ్... చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా...

Ram Charan: రామ్ చరణ్ కి పాన్ ఇండియాలో ఉన్న మార్కెట్ ఎంత…

Ram Charan: 'చిరుత' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్... మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ...

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...