Homeఎంటర్టైన్మెంట్Rajamouli Sensational video: బ్రేకింగ్: పాపులర్ యాంకర్ ని కిడ్నాప్ చేసిన రాజమౌళి టీం.. సంచలనం...

Rajamouli Sensational video: బ్రేకింగ్: పాపులర్ యాంకర్ ని కిడ్నాప్ చేసిన రాజమౌళి టీం.. సంచలనం రేపుతున్న వీడియో!

Rajamouli Sensational video: ఒక సినిమాని ఎలా ప్రమోట్ చెయ్యాలి అనే విభాగం లో మాస్టర్ మైండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన రాజమౌళి(SS Rajamouli) మాత్రమే. సినిమా విడుదలకు ముందు ఆయన చేసే ప్రొమోషన్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియా లో,టీవిలో, ఇలా ఎక్కడ చూసినా రాజమౌళి ప్రమోషన్స్ కి సంబంధించిన కంటెంట్ కనిపిస్తూనే ఉంటుంది. అభిమానులు ఇక చాలు బాబోయ్ అని అడిగినా కూడా ఆపని రేంజ్ లో రాజమౌళి ప్రొమోషన్స్ […]

Rajamouli Sensational video: ఒక సినిమాని ఎలా ప్రమోట్ చెయ్యాలి అనే విభాగం లో మాస్టర్ మైండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన రాజమౌళి(SS Rajamouli) మాత్రమే. సినిమా విడుదలకు ముందు ఆయన చేసే ప్రొమోషన్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియా లో,టీవిలో, ఇలా ఎక్కడ చూసినా రాజమౌళి ప్రమోషన్స్ కి సంబంధించిన కంటెంట్ కనిపిస్తూనే ఉంటుంది. అభిమానులు ఇక చాలు బాబోయ్ అని అడిగినా కూడా ఆపని రేంజ్ లో రాజమౌళి ప్రొమోషన్స్ ఉంటాయి. అయితే ఇదంతా కేవలం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతనే జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Superstar Maheshbabu) మూవీ కి షూటింగ్ ప్రారంభ దశ నుండే ఒక రేంజ్ లో ప్రొమోషన్స్ చేయడం మొదలు పెట్టారు. ఎల్లుండి రామోజీ ఫిల్మ్ సిటీ లో జరగబోయే #Globetrotter ఈవెంట్ కి రాజమౌళి చేస్తున్న ప్రమోషన్స్ ప్లాన్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.

కాసేపటి క్రితమే మూవీ టీం ఒక వీడియో ని విడుదల చేసింది. ఆ వీడియో లో నార్త్ ఇండియా లో అత్యంత పాపులారిటీ ని సంపాదించిన ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ ఉన్నాడు. చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ముందుగా ఆశిష్ మూవీ టీం ని తిట్టుకుంటూ వస్తుంటాడు. ప్రొమోషన్స్ అని చెప్పి నాంమ్మించి, ఆ తర్వాత కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ కి తీసుకొచ్చారని, నా పాస్ పోర్ట్, వీసా కూడా లాగేసుకున్నారని, వీళ్ళ సంగతి ఏంటో చూడాలి అని లోపలకు వస్తాడు. లోపలకు రాగానే రాజమౌళి ని చూసి షాక్ కి గురి అవుతాడు. ‘రాజమౌళి సార్. మీరు నన్ను కిడ్నాప్ చేశారా?’ అని అడుగుతాడు. అవును అని రాజమౌళి సమాధానం చెప్పగా, ఎందుకు సార్ అని ఆశిష్ అడుగుతాడు. అది తెలియాలంటే నవంబర్ 15 వరకు ఎదురు చూడు అని అంటాడు రాజమౌళి.

చూసేందుకు చాలా క్యూట్ గా అనిపిస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. రాజమౌళి తన సినిమా విడుదల సమయం లో ఏ రేంజ్ లో ప్రొమోషన్స్ చేస్తాడో, ఈ సినిమాకు కేవలం అప్డేట్ రివీల్ కోసమే ఆ స్థాయి ప్రొమోషన్స్ చేస్తున్నాడు . దీనిని బట్టీ ఆయన ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. మహేష్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారుగా 50 వేలమంది ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారట. ఇది ఒక ఓపెన్ ఈవెంట్ అని, ఎంత మంది అయినా వెళ్లొచ్చని సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. దీనిపై రాజమౌళి స్పందిస్తూ అలాంటి రూమర్స్ నమ్మొద్దని, కేవలం పాసులు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper