Varanasi Glimpses Review: మొన్నటివరకు హాలీవుడ్ సినిమాలు ఇండియాలో హల్చల్ చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగు సినిమాకి హాలీవుడ్ స్థాయిని తీసుకోరాబోతున్నారు. దర్శక ధీరుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ‘గ్లోబ్ ట్రిట్టర్’ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రీలీజ్ చేశాడు. సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో ఒక విజివల్ రూపంలో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సైన్స్ ని, చరిత్రని, పురాణాలను కలుపుతూ ఈ గ్లింప్స్ రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 512CE వారణాసి (కామన్ ఎరా… క్రీస్తు శకానికి సమానమైందిగా భావించవచ్చు) ఇక అప్పటి నుంచి 2027 CE ని కలుపుతూ ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…అలాగే 7200 BCE వరకు ఈ మూవీ కనెక్షన్ ఉండబోతుందట…త్రేతాయుగం లో రాముడికి సంబంధించిన స్టోరీ ని కూడా ఇందులో కలుపుతుండటం విశేషం… ఇక గ్లింప్స్ లో విజువల్ గా చాలా బాగా చూపించిన విధానం అందరికి నచ్చింది.
కానీ ఇదంతా యానిమేషన్ రూపం లోనే చేశారు. అలాగే మహేష్ బాబు నంది మీద శూలం పట్టుకుని వచ్చే సన్నివేశం నిజంగా ప్రేక్షకులకు గూజ్ బంప్స్ ఎపిసోడ్ అనే చెప్పాలి. మాస్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ జ్ఞాపకాలతో మరో సంవత్సరం పాటు సినిమా వచ్చేదాకా అభిమానులు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…
ఇదంతా ఓకే కానీ ఈ విజువల్ గ్రాండియర్ అనేది రాజమౌళి సినిమాల్లో మనకు తరచూ కనిపిస్తూ ఉంటుంది. కానీ పురాణాలను కలుపుతూ సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేయడం అనేది అది కత్తి మీద సాము లాంటింది… నిజానికి అది రాజమౌళి స్ట్రాంగ్ జోన్ కాదు… రాజమౌళి సినిమా అంటే ఒక హీరో తనకంటే బలమైన విలన్ ని ఎలా ఎదుర్కొంటాడు అనే పాయింట్ తో ఆయన పర్ఫెక్ట్ సినిమాలు చేయగలరు.
దీన్ని చూస్తుంటే రాజమౌళి అనవసరంగా హంగులకు ఆర్భాటాలకు పోయి హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతో తెలుగు ప్రేక్షకులను మర్చిపోయాడా? అనే ఒక ఫీల్ కలుగుతోంది. కానీ రాజమౌళి గత సినిమాల్లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయనే విషయం కూడా స్పష్టం అవుతోంది… ఏ మాత్రం మిస్టేక్ జరిగిన రాజమౌళి కి భారీ దెబ్బ పడే అవకాశం ఉంది….చూడాలి మరి ఈ మూవీని రాజమౌళి ఎలా డీల్ చేస్తాడు అనేది…