Mahesh Babu Varanasi: రాజమౌళి ఏ సినిమా చేసిన అదొక సంచలనంగా మారుతోంది. ఎందుకంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ట్రై చేయనటువంటి డిఫరెంట్ జానర్ లో ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలుగా నిలవడంతో ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది… ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లుక్కు కు సంబంధించిన వివరాలన్నింటిని తెలియజేశాడు. అందులో భాగంగానే ఈ సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతోందో ఒక విజువల్ రూపంలో ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు… చరిత్ర, సైన్స్, పురాణాలు అన్నిటిని కలుపుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి హై స్టాండర్డ్ ఉన్న డైరెక్టర్ సినిమా వస్తోంది అంటే మాత్రం ప్రేక్షకులందరికి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి స్పష్టం చేశారు.
ఇందులో మహేష్ బాబు గురువు పాత్ర ఉందని దానికోసం తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ పాత్రలో రజనీకాంత్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తొందరలోనే ఆయనకు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి రాజమౌళి మరో ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈలోపు రజినీకాంత్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని రాజమౌళి భావిస్తున్నాడు. ఎందుకంటే దానికి సంబంధించిన ఈవెంట్ కూడా మరో ఆరు నెలల్లో కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ఉన్నాడట. అందువల్లే రజనీకాంత్ సినిమాలో నటిస్తున్న విషయాన్ని చాలా గోప్యంగా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇద్దరు సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటించడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక రజనీకాంత్ కనక ఈ సినిమాలో నిజంగా నటిస్తే మాత్రం ఈ సినిమా హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఉండదు. అలాగే ఈ సినిమాతో పెను సంచలనాలు క్రియేట్ చేసే అవకాశమైతే ఉంది. కాబట్టి ఇటు మహేష్ బాబు కి, అటు రజనీకాంత్ కి కూడా ఈ సినిమా భారీ సక్సెస్ ని కట్టబెడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…