Rajamouli And Mahesh Babu: మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో జాయిన్ అవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబుకి రాజమౌళి ఒక పెద్ద టాస్క్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే వీళ్ళ కాంబో లో వచ్చే సినిమాలో మహేష్ బాబు కొన్ని షాట్లలో షర్టు లేకుండా కనిపించాల్సి ఉంటుంది.
ఇక దానికోసం మహేష్ బాబుని సిక్స్ ప్యాక్ చేయాలని రాజమౌళి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు బాహుబలి లో ప్రభాస్, త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు సిక్స్ ప్యాక్ తో మనకు కనిపించారు. మరి మహేష్ బాబు కూడా ఈ సినిమా లో సిక్స్ ప్యాక్ చేసి కనిపిస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే రాజమౌళి మాత్రం సిక్స్ ప్యాక్ చేసేదాకా మహేష్ బాబు ని వదిలిపెట్టడు. ఎందుకంటే రాజమౌళి ఒకటి అనుకున్నాడు అంటే కచ్చితంగా అది చేసి తీరాల్సిందే ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు హీరో అంటే హీరోలానే ఉండాలి. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి అని రాజమౌళి అనుకుంటాడు. కాబట్టి ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా హీరో స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తేనే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.
అలాగే ఆ సినిమాలో చేసిన హీరోకి కూడా మంచి పేరైతే వస్తుంది. రాజమౌళి కోరినట్టు గా మహేష్ బాబు సిక్స్ ప్యాక్ చేయడానికి కసరత్తులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఇంతకు ముందు కూడా మహేష్ బాబు వన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయాలనుకున్నాడు కానీ చివరి నిమిషంలో సిక్స్ ప్యాక్ అనేది తేడా కొట్టడంతో మధ్యలో ఆపేసినట్టుగా అప్పట్లో చిత్ర యూనిట్ తెలియజేశారు.
మరి ఇప్పుడు ఈ సినిమా కోసం మహేష్ బాబు సిక్స్ ప్యాక్ ని తెచ్చుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉండి…ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు అభిమానులు మాత్రం మా హీరో కొంచం సాప్ట్ గా ఉంటాడు సర్ ప్రభాస్, ఎన్టీయార్, రామ్ చరణ్ లను హింసించినట్టు గా మా హీరోని అలా టార్చర్ పెట్టకండి సర్ అసలే క్యూట్ గా ఉంటాడు అంటూ రాజమౌళి కి పర్సనల్ గా మెసేజ్ లు పెడుతున్నట్టు గా తెలుస్తుంది…