Homeఎంటర్టైన్మెంట్Rajamouli Varanasi: 'వారణాసి' విషయంలో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి..ఇంకెన్ని సామీ!

Rajamouli Varanasi: ‘వారణాసి’ విషయంలో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి..ఇంకెన్ని సామీ!

Rajamouli Varanasi: వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల అవ్వబోతున్న రాజమౌళి(SS Rajamouli) ‘వారణాసి'(Varanasi Movie) గురించి సోషల్ మీడియా లో ఇప్పటి నుండే ప్రతీ రోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతుందే ఉంది. ఈ సినిమాతో రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటి నుండే పలు హాలీవుడ్ మీడియా చానెల్స్ కి రాజమౌళి తో పాటు, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వి రాజ్ […]

Rajamouli Varanasi: వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల అవ్వబోతున్న రాజమౌళి(SS Rajamouli) ‘వారణాసి'(Varanasi Movie) గురించి సోషల్ మీడియా లో ఇప్పటి నుండే ప్రతీ రోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతుందే ఉంది. ఈ సినిమాతో రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటి నుండే పలు హాలీవుడ్ మీడియా చానెల్స్ కి రాజమౌళి తో పాటు, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వి రాజ్ సుకుమారన్ లు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పోస్టర్స్ లో ప్రత్యేకంగా ‘ఫిల్మ్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం తయారు చేయబడినది’ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. అంటే ఈ సినిమాని మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాటులోనే తెరకెక్కిస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూ లో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘మా ఇండియా లో అత్యధిక శాతం స్క్రీన్స్ మొత్తం స్కోప్ ఫార్మటు లోనే ఉంటాయి. మా ప్రేక్షకులు ఆ ఫార్మటు థియేటర్స్ లోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో చూడరని కాదు, కానీ మా ఇండియా లో ఆ స్క్రీన్స్ సంఖ్య చాలా తక్కువ. ఈ సినిమాని ఐమ్యాక్స్ ఫార్మటులో తీద్దాం అనుకున్నప్పుడు ఇది మాకొక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించింది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో చిత్రాన్ని తెరకెక్కించి, స్కోప్ ఫార్మటు ని తగ్గించాలా?, లేదా సినిమా స్కోప్ లో తెరకెక్కించి, ఐమ్యాక్స్ వెర్షన్ ని ఫ్రేమ్ చేయాలా?, ఈ అంశంపై నేను మా సినిమాటోగ్రాఫర్ టీం తో కలిసి చాలా రోజుల పాటు చర్చించాను. చివరికి ఈ సినిమా కోసం మేము ఒక ఫార్ములా ని కనుకున్నాము. ‘వారణాసి’ చిత్రం మొత్తం సినిమా స్కోప్ ఫార్మటు ‘1.90:1’ రేషియో లోనే ఉంటుంది. ఐమ్యాక్స్ స్క్రీన్స్ లలో మాత్రం సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు నిజమైన ఐమ్యాక్స్ ఫార్మటు ‘1:43:1′ లో కనిపిస్తాయి. ఇక ఎప్పుడు ఏ ఫార్మటు లో చూపించాలి అనేది ఇప్పటికీ మాకు ఒక పెద్ద సవాల్’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇంత ఆలోచించడం ఎందుకు, రెండు రకాల షాట్స్ ని కలిపేద్దాం అని నా టెక్నీకల్ టీం సలహా ఇచ్చింది. కానీ నాకు అలా చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. అలా చేస్తే ఆ షాట్స్ లో ఉండే రియల్ ఫీల్ పోతుంది. అలా చేయడం కంటే, ఆడియన్స్ కి ఐమ్యాక్స్ ఫార్మటు లో తీసినా తీయకపోయిన, నిజమేనా ఐమ్యాక్స్ ఫార్మాటులో చూస్తున్న అనుభూతిని కలిగిద్దాం అని చెప్పాను’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. మన దేశంలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ తక్కువ ఉండొచ్చు కానీ, ఓవర్సీస్ మొత్తం ఈ ఫార్మటు స్క్రీన్స్ ఉంటాయి. సరైన సినిమా పడితే వీటి నుండి వచ్చే కలెక్షన్స్ ఊహాతీతం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper