Homeఎంటర్టైన్మెంట్టీజర్ టాక్ : ఆకట్టుకున్న 'రాజ రాజ చోర‌'

టీజర్ టాక్ : ఆకట్టుకున్న ‘రాజ రాజ చోర‌’

యంగ్ హీరో ‘శ్రీ‌విష్ణు’ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హా కథలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘రాజ రాజ చోర‌’ అంటూ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా శ్రీవిష్ణు క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైకి రారాజు. లోలోప‌ల‌ చోరుడు అన్నమాట. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌ గా తిరుగుతూ దొంగ‌త‌నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రైమ్ కామెడీ మూవీలో […]

Raja Raja Choraయంగ్ హీరో ‘శ్రీ‌విష్ణు’ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హా కథలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘రాజ రాజ చోర‌’ అంటూ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా శ్రీవిష్ణు క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైకి రారాజు. లోలోప‌ల‌ చోరుడు అన్నమాట. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌ గా తిరుగుతూ దొంగ‌త‌నాలు చేస్తూ ఉంటాడు.

ఈ క్రైమ్ కామెడీ మూవీలో శ్రీ విష్ణు పాత్ర‌ సరికొత్తగా ఉంది. త‌న పాత్ర స్వ‌భావంలో వచ్చే హావ భావాలను శ్రీవిష్ణు చాల బాగా పలికించాడు. అలాగే టీజ‌ర్ లోని మేకింగ్ షాట్స్, విభిన్నమైన పాత్రలు, ఆ పాత్రల చుట్టూ రొటీన్ కి భిన్నంగా జరిగే డ్రామా మరియు వివేక్ సాగ‌ర్ నేప‌థ్యం ఇలా టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ రాజ రాజ చోరని ప‌ట్టుకుని, పాత కేసులు సైతం త‌న‌పై వేసేయాల‌న్న కుతూహ‌లంతో తిరిగే పోలీస్ అధికారిగా ర‌విబాబు కూడా బాగా నవ్వించాడు. ఓవరాల్ గా టీజర్ లో హిలేరియ‌స్ కామెడీకి మంచి స్కోప్ ఉంది. శ్రీ‌విష్ణుకి ఈ సినిమాతో మరో హిట్ పడటం గ్యారంటీ అనే నమ్మకం కలిగింది. మొత్తమ్మీద ఈ టీజర్, ఈ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేస్తూ అంచనాలను డబుల్ చేసింది.

ఈ సినిమాకి వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, ర‌విబాబు, అజ‌య్ ఘోష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హ‌సిత్ గోళీ ద‌ర్శ‌కుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనిబట్టి శ్రీ‌విష్ణుకి ఈ సినిమాతో మ‌రో భారీ హిట్ ప‌డిన‌ట్టే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper