అసలు రాజన్న భార్య పార్వతీ అమ్మాళ్ ప్రస్తుతం ఉన్న ధీన పరిస్థితికి కన్నీరు పెట్టుకున్నారు. ముసలితం వచ్చినా కూడా ఇప్పటికీ ఆమె ఓ పూరి గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ ఉండడం చూసి చాలా బాధపడ్డారు. సినిమాలో మాత్రం ఆమె ఇల్లు కట్టుకొని ఉంటున్నట్లు చూపించారు. కానీ ఆమె మాత్రం నిజ జీవితంలో గుడిసె లోనే బతుకుతుంది. అందరూ సినిమాను పొగుడుతున్నారు, వీరి జీవితాలపై వారు సినిమాను నిర్మించడం మంచి విషయమే అయిన కానీ లాభపడింది మాత్రం సినిమా బృందమే. అసలు పార్వతి ఇప్పుడు ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి అని ఒక్కరూ కూడా ఆలోచించట్లేదు. నటించిన వారిని పొగుడుతున్నారు తప్ప… వారిని పట్టించుకోవట్లేదు. కానీ లారెన్స్ మాత్రం అలా చేయలేదు.
రాఘవ లారెన్స్ సొంత ఇల్లు కట్టిస్తున్నట్టు తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. అంతేకాకుండా దర్శకుడు లారెన్స్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. అలాగే చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటామని లారెన్స్ తెలిపారు. సిన తల్లి పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయా అని చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక లారెన్స్ తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.