Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా దక్షిణాది స్టేట్ల కౌన్సిల్ సమావేశానికి ఈ నెల 14న తిరుపతికి రానున్నారు. ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. తెలుగు ప్రాంతాల సీఎంలు కూడా పాల్గొనే ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ పలు సమస్యలు విన్నవించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పెట్రో ధరలపై రేగుతున్న రగడపై అమిత్ షాతో మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా రెండు ప్రాంతాల్లో అధికార పార్టీలను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనపై ఇద్దరు సీఎంలు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మన ప్రాంతంలో జరిగే సమావేశం కావడంతో అందరు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. మనకు తాయిలాలు ఏవైనా ఉంటాయోమోనని ఆకాంక్ష అందరిలో వస్తోంది. తిరుపతిలో జరిగే సమావేశం కావడంతో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం రానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో బీజేపీ నేతల విమర్శలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో కేసీఆర్ కూడా అంతే స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించారు. దీంతో అమిత్ షాతో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనే దానిపైనే అందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కూడా పెట్రోధరల తగ్గింపుపై బీజేపీ నేతలు జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. దీంతో జగన్ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అమిత్ షా తో జగన్ పెట్రోధరల విషయమై చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అమిత్ షా నుంచి ఎలాంటి హామీ తీసుకుంటారో అనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: BJP Pic Of The Day: దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులంతా ఇలా ఒక్కచోట..
రెండు స్టేట్లు కేంద్రానికి కీలక సమయాల్లో సాయం అందిస్తూనే ఉన్నాయి. కానీ వాటికి మాత్రం సరైన సమయంలో సాయం మాత్రం అందడం లేదనేది వారి వాదన. దీంతో అమిత్ షా కేసీఆర్, జగన్ కు ఏ మేరకు సాయం చేసేందుకు ఎలాంటి హామీలిస్తారనే దానిపై నేతల్లో మీమాంస నెలకొంది. మొత్తానికి అమిత్ షా పర్యటనను ఉపయోగించుకుని ఆయన నుంచి ఏదో రూపంలో సాయం మాత్రం పొందాలనే పట్టుదలతో తెలుగు ప్రాంతాల సీఎంలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: KCR vs BJP: ఏకుమేకవుతున్న బీజేపీ.. కేసీఆర్ లో అందుకేనా ఫస్ట్రేషన్?