Raghava Lawrence: మనం జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు, ఆస్తి ఏది మనతో రాదు. కేవలం కీర్తి ప్రతిష్టలు, మన వల్ల సమాజం లో జరిగే గొప్ప మార్పు మాత్రమే శాశ్వతం. ఈ విషయాన్నీ గ్రహించిన ప్రతీ వ్యక్తి దేవుడే అవుతాడు. ముఖ్యంగా కోట్ల రూపాయిలు సంపాదించే సినీ సెలబ్రిటీలకు ఇలా గొప్పగా బ్రతికే అవకాశాన్ని ఇస్తాడు దేవుడు. అలాంటి అవకాశం ప్రముఖ కొరియోగ్రాఫర్/ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawarence) కి కూడా ఇచ్చాడు. ఇప్పటికే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు, ఇప్పటికీ చేస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఆయన ఉదారతను చాటుకున్నాడు. తాను కష్టపడి కట్టించుకున్న సొంత ఇంటిని పాఠశాలగా మారుస్తున్నట్టు కాసేపటి క్రితమే అధికారికంగా తెలిపాడు లారెన్స్. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే లక్ష్యం గా ఈ పాఠశాలని నిర్మించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లారెన్స్ ‘కాంచన 4’ చిత్రం చేస్తున్నాడు.
Also Read: ‘మిరాయ్’ లో ప్రభాస్..సోషల్ మీడియా షేక్ అయ్యే ట్వీట్ వేసిన తేజ సజ్జ!
ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన అడ్వాన్స్ తో ఈ సేవాకార్యక్రమాన్ని చేపినట్టు లారెన్స్ చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో పెరిగిన ఒక విద్యార్థి , త్వరలో ప్రారంభించబోయే ఈ పాఠశాలలో టీచర్ గా వ్యవహరిస్తాడని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ సినెమాలకు నేను తీసుకునే అడ్వాన్స్ ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటానని అన్ను అభిమానించే వాళ్లకు, నా శ్రేయోభిలాషులకు తెలుసు. నా కష్టార్జీతం తో నేను కట్టుకున్న ఈ ఇంటిని ఇప్పుడు పాఠశాలగా మార్చేస్తున్నాను. డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్న కొత్తల్లో, నేను సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇల్లు ఇది. నాకు ఒక మధుర జ్ఞాపకం లాంటిది. అమ్మ లాంటి ఈ ఇంటిని ఇప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపయోగిస్తుండడం ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం లాగా భావిస్తున్నాను. ఈ సరికొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు.
ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘కాంచన 4’ చేస్తున్నాడు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న ‘బెంజ్’ అనే చిత్రం లో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఆయనకు ఎంతో ప్రత్యేకం కానున్నాయి. ముఖ్యంగా కాంచన సిరీస్ లో వచ్చిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక దానిని మించి ఒకటి ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంచన 4 కూడా అలాగే నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించబోతుందని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియనున్నాయి.