Raghava Lawrence: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు దర్శకులు చాలా సేవా కార్యక్రమాలను చేపడుతూ పేదలకు ఏదో ఒక రకంగా మంచి చేయాలని చూస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్లలో రాఘవ లారెన్స్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటికే అంగవైకల్యం తో ఉన్న వాళ్ల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగులు మొత్తం అతనే చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు పేదలకు రుచికరమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఒక కార్యక్రమం అయితే చేపట్టాడు. తన తల్లి పేరు మీదుగా ‘కన్మణి అన్నదాన విందు’ అనే కార్యక్రమాన్ని చేపట్టాడు. రాఘవ లారెన్స్ మొదటి నుంచి కూడా పేదలకు ఏదో ఒక రకంగా సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నాడు. ఇక సినీ కార్మికులకు సైతం తన చేతనైనంతా సాయాన్ని అందిస్తూ తను సంపాదించిన దానిలో చాలావరకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తన తల్లి పేరు మీద సేవ కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
ఇక ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సినీ సెలబ్రిటీస్ సైతం ఇలాంటి కార్యక్రమాలను చేపడితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీ చేయిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మరి కొంతమంది మరికొన్ని సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో వీళ్లు ఇలా చేయడం వల్ల వాళ్ళ అభిమానులకు గాని సగటు ప్రేక్షకులకు కానీ ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. వాళ్ళని అభిమానిస్తున్న కొంతమంది సంగతి జనాలు సైతం వాళ్ళ బాటలో నడిచి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలను చేసే అవకాశాలైతే ఉంటాయి…
ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా చేస్తూనే కొన్ని సినిమాలను డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఇక మరికొన్ని సినిమాల్లో యాక్టింగ్ కూడా చేస్తూ అతనికి ముందుకు సాగిస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో రాఘవ లారెన్స్ కాంచన సిరీస్ కి చాలామంది అభిమానులైతే ఉన్నారు. ఇక మరోసారి ఆ సిరీస్ ని కొనసాగిస్తూ అందులో మంచి సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…